APS Jobs 2026 : ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 10+2 అర్హతతో LDC & కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
APS Jobs 2026 : ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 10+2 అర్హతతో LDC & కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి!
Army Public School Recruitment 2026:
Army Public School RK Puram Secunderabad నుండి 2026 సంవత్సరానికి సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా 10+2 మరియు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత ఉన్న వారు 01 మే 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. PGT
2. TGT
3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
4. LDC
5. రిసెప్షనిస్ట్
6. నర్సింగ్ అసిస్టెంట్
7. IT సూపర్వైజర్
8. సైన్స్ ల్యాబ్ అటెండెంట్
9. కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 09
విద్య అర్హతలు :
LDC:
1. గ్రాడ్యుయేషన్ లేదా ఎక్స్-సర్వీస్‌మెన్‌కు 10 సంవత్సరాల అనుభవం.
2. కంప్యూటర్ పరిజ్ఞానం (MS Office, టైపింగ్ వేగం, ఇంటర్నెట్).
రిసెప్షనిస్ట్ :
1. ఏదైనా డిగ్రీ
2. ఇంగ్లీష్, హిందీ, తెలుగులో కమ్యూనికేషన్ స్కిల్స్.
3. MS Office పరిజ్ఞానం (మహిళలకు ప్రాధాన్యత).
నర్సింగ్ అసిస్టెంట్ :
1. 10+2 + నర్సింగ్ డిప్లొమా
2. కనీసం 5 సంవత్సరాల అనుభవం.
IT సూపర్వైజర్ :
1. కంప్యూటర్/హార్డ్‌వేర్‌లో డిప్లొమా
2. నెట్వర్కింగ్, OS, ప్రోగ్రామింగ్ పరిజ్ఞానం.
సైన్స్ ల్యాబ్ అటెండెంట్ :
1. సైన్స్‌తో 10+2
2. కంప్యూటర్ బేసిక్స్
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్:
1. 10+2 + కంప్యూటర్ డిప్లొమా
2. MS Office, ఇంటర్నెట్ పరిజ్ఞానం.
వయో పరిమితి:
01 ఏప్రిల్ 2026 నాటికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
దరఖాస్తు ఫారమ్‌తో పాటు, సికింద్రాబాద్‌లో చెల్లుబాటు అయ్యే విధంగా Army Public School RK Puram Secunderabad పేరుతో రూ.250/- డిమాండ్ డ్రాఫ్ట్‌ను తప్పనిసరిగా జత చేయాలి.
జీతం వివరాలు :
నెలకు రూ. 38,000/- నుండి రూ. 40,000/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. ఇంటర్వ్యూ
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
2. అధికారిక వెబ్సైట్ నుండి ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
3. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం, అవసరమైన డాక్యుమెంట్స్, రూ.250/- డిమాండ్ డ్రాఫ్ట్‌తో పాటు ఈ చిరునామాకు పంపాలి:
అడ్రస్ :
ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్.కె.పురం, సికింద్రాబాద్ – 500056.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 01 మే 2026
Notification PDF Click Here
Official Website Click Here