AP 10th Class Results 2026 Release Date | రేపే పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
AP 10th Class Results 2026 Release Date | రేపే పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
AP 10th Class Results 2026 Latest Update:
AP SSC Results 2026 Date కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 30 ఏప్రిల్ 2026 (గురువారం) విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ సంవత్సరం జరిగిన SSC పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి మరియు ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ పూర్తయింది. అందువల్ల AP SSC Results 2026 Date ప్రకటించబడింది.
విద్యార్థులు ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్ లేదా WhatsApp సేవ ద్వారా తమ రిజల్ట్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు.
ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు: https://bse.ap.gov.in/
వెబ్సైట్ ద్వారా ఫలితాలు చూసే విధానం:
1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజ్‌లో “SSC Public Examinations 2026 Results” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ Hall Ticket Number & Date of Birth నమోదు చేయండి.
4. “Submit” పై క్లిక్ చేస్తే వెంటనే మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
WhatsApp ద్వారా ఫలితాలు ఎలా పొందాలి? (Mana Mitra) :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న Mana Mitra WhatsApp సేవ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.
విధానం:
1. మీ ఫోన్లో 9552300009 నంబర్‌కు WhatsAppలో “Hi” మెసేజ్ పంపండి.
2. అందులో “విద్యా సేవలు” ఎంపికను సెలెక్ట్ చేయండి.
3. తరువాత SSC Public Exam Results పై క్లిక్ చేయండి.
4. మీ Hall Ticket Number నమోదు చేస్తే వెంటనే PDF రూపంలో ఫలితాలు పొందవచ్చు.
గమనిక: ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్సైట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కొంత సమయం తరువాత మళ్లీ ప్రయత్నించడం మంచిది.