Central Govt Jobs

RRB ALP Notification 2026 : రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీ.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల…

calendar_month May 8, 2026 person chitra

RRB ALP Notification 2026 : రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీ.. 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల…

RRB ALP Notification 2026 :

భారతీయ రైల్వేలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం వచ్చింది. భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 2026-27 నియామకాలకు సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 11,127 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రైల్వే శాఖలో స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం, భవిష్యత్ భద్రత కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 15 మే 2026 నుంచి ప్రారంభమవుతుండగా, చివరి తేదీ 14 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) లో ఉద్యోగాలు

పోస్టు పేరు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు

మొత్తం ఖాళీలు : 11,127

విద్య అర్హతలు :

1. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. అదనంగా సంబంధిత ట్రేడ్స్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.

3. ముఖ్యంగా ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ వంటి ట్రేడ్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది.

4. అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయో పరిమితి:

1. 01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

జీతం వివరాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 ప్రకారం రూ.19,900 నుండి రూ.63,200 వరకు ప్రాథమిక వేతనం అందుతుంది.

2. ఇతర అలవెన్సులు కలిపి నెలకు సుమారు రూ.45,000 వరకు జీతం పొందే అవకాశం ఉంటుంది.

ఎంపిక విధానం :

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు.

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ ఎగ్జామినేషన్

4. ఈ దశల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

2. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.

3. చివరి తేదీకి ముందుగానే అప్లై చేసుకోవడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 14 జూన్ 2026

ఈ RRB ALP Notification 2026 ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు విడుదల కావడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని భావించే వారికి ఇది గొప్ప అవకాశం.

RRB ALP New Vacancy 2026: Click to Download

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *