AP Government Jobs 2026: 10వ తరగతి అర్హతతో ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు.. రూ.32,670 వరకు జీతం!..వెంటనే దరఖాస్తు చేసుకోండి..
AP Government Jobs 2026: 10వ తరగతి అర్హతతో ఏపీ సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో ఉద్యోగాలు.. రూ.32,670 వరకు జీతం!..వెంటనే దరఖాస్తు చేసుకోండి..
AP DCHS Secondary Health Hospitals Recruitment 2026 :
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (DCHS) పరిధిలోని సెకండరీ హెల్త్ హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో పలు పారామెడికల్ మరియు సహాయక సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు 18 జూన్ 2026 నుంచి 30 జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకాల ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II, డార్క్ రూమ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్ (MNO/FNO), పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్ (VOC MLT), DMLT లేదా B.Sc (MLT) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.32,670 వరకు వేతనం అందించనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP DCHS Secondary Health Hospitals లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II
2. డార్క్ రూమ్ అసిస్టెంట్
3. జనరల్ డ్యూటీ అటెండర్ (MNO/FNO)
4. పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు

విద్య అర్హతలు :
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II :
1. ఇంటర్మీడియట్ (VOC MLT) లేదా DMLT లేదా B.Sc (MLT) ఉత్తీర్ణత ఉండాలి.
2. VOC (MLT) చేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
3. తప్పనిసరిగా APPMBలో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
4. DMLT మరియు B.Sc (MLT) రెండూ ఉన్నట్లయితే, అత్యధిక మార్కులు పొందిన అర్హతను పరిగణనలోకి తీసుకుంటారు.
డార్క్ రూమ్ అసిస్టెంట్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుంచి డార్క్ రూమ్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిప్లొమా లేదా CRA/DMIT వంటి రేడియోగ్రఫీ లేదా ఎక్స్-రే టెక్నాలజీలో డిప్లొమా అర్హత ఉండాలి.
జనరల్ డ్యూటీ అటెండర్ (MNO/FNO) :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి SSC/10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్ట్ మార్టం అసిస్టెంట్ :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి :
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి.
వయో సడలింపు :
1. SC, ST, BC, EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
2. మాజీ సైనికులకు : సైనిక సేవ కాలానికి అదనంగా 3 సంవత్సరాలు
3. దివ్యాంగులకు : 10 సంవత్సరాలు
4. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయస్సు : 52 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
1. OC అభ్యర్థులు : రూ.350 /-
2. SC/ST/BC అభ్యర్థులు : రూ.250 /-
3. దివ్యాంగ అభ్యర్థులు : ఫీజు మినహాయింపు
4. దరఖాస్తు ఫీజును కాకినాడ జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ పేరిట, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలెక్టరేట్ బ్రాంచ్, కాకినాడలో చెల్లించదగిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
జీతం వివరాలు :
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II – రూ.32,670/-
డార్క్ రూమ్ అసిస్టెంట్ -రూ.28,220/-
జనరల్ డ్యూటీ అటెండర్ (MNO/FNO)- రూ.15,000/-
పోస్ట్ మార్టం అసిస్టెంట్రూ – .15,000 /-
ఎంపిక విధానం :
1. అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.
2. అర్హత పరీక్షలో లేదా సమాన అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కులకు 75 శాతం వెయిటేజ్ కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం :
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను జతచేసి, కాకినాడ జిల్లా DM&HO కార్యాలయం మూడో అంతస్తులో ఉన్న DCHS కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద స్వయంగా సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 18 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 30 జూన్ 2026
Notification & Application Pdf Click Here
Official Website : Click Here