Govt. Schemes

AP Thalliki Vandanam 2026: రూ.13,000 తల్లికి వందనం డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇవి ఉండాలి. ఇలా చెక్ చేసుకోండి!

calendar_month June 21, 2026 person chitra

AP Thalliki Vandanam 2026: రూ.13,000 తల్లికి వందనం డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ఇవి ఉండాలి. ఇలా చెక్ చేసుకోండి!

AP Thalliki Vandanam 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం 2026 కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13,000 ఆర్థిక సహాయం జూలై మూడో వారంలో జమ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం వెల్లడిస్తోంది.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆధార్ ధృవీకరణ మరియు ఇతర సాంకేతిక ప్రక్రియలు పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

తల్లికి వందనం పథకం ఎవరికీ వర్తిస్తుంది?

తల్లికి వందనం పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒకే కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా, అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 68 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రూ.13,000 డబ్బులు రావాలంటే తప్పనిసరిగా చేయాల్సిన పనులు :

తల్లికి వందనం డబ్బులు ఎలాంటి ఆటంకం లేకుండా మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే కింది అంశాలను ముందుగానే పరిశీలించి పూర్తి చేసుకోవాలి.

1. తల్లి ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి.

2. బ్యాంక్ ఖాతాలో e-KYC ప్రక్రియ పూర్తై ఉండాలి.

3. NPCI ద్వారా ఆధార్ సీడింగ్ పూర్తి కావాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. . విద్యార్థి పాఠశాల హాజరు శాతం కనీసం 75% లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.

5. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు సరిగ్గా ఉండాలి.

6. గ్రామ/వార్డు సచివాలయం డేటాబేస్‌లో కుటుంబ వివరాలు సరిగా నమోదు అయి ఉండాలి.

పై వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తల్లికి వందనం అర్హతను ఇలా చెక్ చేసుకోండి ?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

2. మెనూలో Scheme Eligibility అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

3. మీ ఆధార్ నంబర్, Scheme Type లో Thalliki Vandanam, Year వివరాలు నమోదు చేయండి.

4. Get Results పై క్లిక్ చేయండి.

5. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

6. OTP నమోదు చేసిన తర్వాత మీ అర్హత వివరాలు కనిపిస్తాయి.

7. అన్ని వివరాలు Eligible అని చూపిస్తే మీకు పథకం ప్రయోజనం లభిస్తుంది.

ఏదైనా సమస్య లేదా అనర్హత కారణం కనిపిస్తే, వెంటనే మీ సమీప సచివాలయాన్ని సంప్రదించి వివరాలను సరిచేసుకోవాలి.

గమనిక: తల్లికి వందనం పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటనలు మరియు చెల్లింపు తేదీల కోసం ప్రభుత్వ తాజా మార్గదర్శకాలను అనుసరించండి.

AP Thalliki Vandanam Scheme Eligibility Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *