AP Jobs

AP Government Jobs 2026: రాత పరీక్షలు లేకుండా 10వ తరగతి అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వరకు జీతం… Apply Now : 

calendar_month June 22, 2026 person chitra

AP Government Jobs 2026: రాత పరీక్షలు లేకుండా 10వ తరగతి అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వరకు జీతం… Apply Now :

AP APVVP Paramedical and Supporting Staff Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (మాజీ APVVP) ద్వారా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఖాళీగా ఉన్న పారామెడికల్ మరియు సపోర్టింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 30 సాయంత్రం 5 గంటలలోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.15,000 నుంచి రూ.32,670 వరకు వేతనం అందించనున్నారు. రాత పరీక్ష లేకుండానే మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (మాజీ APVVP) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. ల్యాబ్ టెక్నీషియన్

2. డార్క్ రూమ్ అసిస్టెంట్

3. ఆఫీస్ సబార్డినేట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. జనరల్ డ్యూటీ అటెండెంట్ / MNO / FNO పోస్టులు

మొత్తం పోస్టులు : 19

ఉద్యోగాల రకం : కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్

విద్యార్హతలు :

ల్యాబ్ టెక్నీషియన్ :

ఇంటర్మీడియట్ (VOC-MLT) లేదా DMLT లేదా B.Sc (MLT) ఉత్తీర్ణులై ఉండాలి. VOC-MLT అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

డార్క్ రూమ్ అసిస్టెంట్ :

ఏపీ ప్రభుత్వం గుర్తించిన సంస్థ నుంచి డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్సులో డిప్లొమా లేదా రేడియోగ్రఫీ/ఎక్స్-రే టెక్నాలజీలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.

ఆఫీస్ సబార్డినేట్ మరియు జనరల్ డ్యూటీ అటెండెంట్ :

SSC/10వ తరగతి లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి :

అభ్యర్థి వయస్సు 18 to 42 సంవత్సరాలు ఉండాలి.

వయోసడలింపులు :

1. SC, ST, BC మరియు EWS వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.

2. మాజీ సైనికులకు – సేవా కాలానికి అదనంగా 3 సంవత్సరాలు

3. వికలాంగులకు – 10 సంవత్సరాలు

4. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయస్సు 52 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

1. OC అభ్యర్థులకు – రూ.350/-

2. SC, ST మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

3. దివ్యాంగులకు – ఫీజు మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు :

ల్యాబ్ టెక్నీషియన్ – రూ.32,670/-

డార్క్ రూమ్ అసిస్టెంట్ – రూ.28,220/-

ఆఫీస్ సబార్డినేట్ / GDA / MNO / FNO – రూ.15,000/-

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపికను విద్యార్హతల్లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇవ్వడంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా చేపడతారు.

2. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త కార్యాలయంలో 2026 జూన్ 30 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 19 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ : 30 జూన్ 2026

Notification Pdf Click Here 

Application Pdf Click Here 

Office Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *