Indian Railway New Rules: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే భారీ జరిమానా.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు…పూర్తి వివరాలు :
Indian Railway New Rules: టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే భారీ జరిమానా.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు…పూర్తి వివరాలు :
Indian Railways New Rules From July 1, 2026 Details in Telugu:
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను మరింత కఠినతరం చేసింది. “జనవిశ్వాస చట్టం” కింద కొన్ని నిబంధనలకు సంబంధించిన జరిమానాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. జూలై 1, 2026 నుంచి ఈ తాజా రైల్వే నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
టికెట్ లేకుండా ప్రయాణిస్తే రూ.500 జరిమానా :
ఇప్పటి వరకు టికెట్ లేకుండా ప్రయాణించిన వారికి కనీస జరిమానా రూ.250 ఉండగా, తాజా నిబంధనల ప్రకారం అది రూ.500కు పెంచబడింది. అంతేకాకుండా ప్రయాణికుడు ప్రయాణించిన దూరానికి సంబంధించిన అసలు టికెట్ ధరతో పాటు అదనంగా రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ ప్రయాణికుడు ఏ స్టేషన్ నుంచి ఎక్కారనే విషయం నిర్ధారణ కాకపోతే, ఆ రైలు ప్రారంభమైన స్టేషన్ నుంచే చార్జీ లెక్కించి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఇతరుల పేరుతో బుక్ చేసిన టికెట్ చెల్లదు :
ఇతరుల పేరుతో బుక్ చేసిన టికెట్‌తో ప్రయాణించడం కూడా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. అలాంటి సందర్భాల్లో ప్రయాణికుడిపై రూ.500 జరిమానా విధించడంతో పాటు అవసరమైతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని రైల్వే శాఖ హెచ్చరించింది.
ఫైన్ చెల్లించకపోతే జైలు శిక్ష :
రైల్వే అధికారులు విధించిన జరిమానాను చెల్లించని వారిపై ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ప్రయాణికులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్‌ను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
అనుమతి లేకుండా ఆహార పదార్థాల విక్రయానికి భారీ జరిమానా :
రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో అనుమతి లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వ్యక్తులు లేదా చిరు వ్యాపారులపై రూ.2,000 వరకు జరిమానా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రైల్వే స్టేషన్లలో బిచ్చాటాన్ని కూడా నిషేధించారు.
మహిళల కోచ్‌లో పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 ఫైన్ :
మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లు లేదా బోగీల్లో పురుషులు ప్రయాణించినట్లు గుర్తిస్తే రూ.2,500 వరకు జరిమానా విధించబడుతుంది. అదేవిధంగా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, దూషించడం వంటి చర్యలకు కూడా భారీ జరిమానాలు విధించనున్నారు.
మే నెలలో రూ.40.85 కోట్ల జరిమానాలు వసూలు :
సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో మే నెలలో సుమారు 4.96 లక్షల మంది టికెట్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై చర్యలు తీసుకుని మొత్తం రూ.40.85 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులకు సూచన :
రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టికెట్‌తోనే ప్రయాణించాలి. రైల్వే నిబంధనలను పాటించడం ద్వారా జరిమానాలు, న్యాయపరమైన చర్యలను నివారించవచ్చు.