Central Govt Jobs

10వ తరగతి అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో MTS ఉద్యోగాలు – వెంటనే దరఖాస్తు చేసుకోండి! | Latest IAF MTS Notification 2026 Apply Now:

calendar_month June 24, 2026 person chitra

10వ తరగతి అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో MTS ఉద్యోగాలు – వెంటనే దరఖాస్తు చేసుకోండి! | Latest IAF MTS Notification 2026 Apply Now:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో MTS ఉద్యోగాలు 2026 :

భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

అర్హత కలిగిన భారతీయ పౌరులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ 27 జూన్ 2026 నుండి ప్రారంభమై, 26 జూలై 2026 సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నియామక ప్రకటన Employment News (27 June – 3 July 2026 సంచిక)లో ప్రచురించబడింది మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : భారతీయ వాయుసేన (Indian Air Force – IAF) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు

మొత్తం పోస్టులు : 06

విద్య అర్హతలు :

1. గుర్తింపు పొందిన బోర్డు లేదా విద్యాసంస్థ నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

వాచ్‌మ్యాన్, లస్కార్, గెస్టెట్నర్ ఆపరేటర్ లేదా తోటమాలి వంటి సంబంధిత పనుల్లో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత కల్పించబడుతుంది.

వయోపరిమితి :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

గమనిక: వయస్సును దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ ఆధారంగా లెక్కిస్తారు.

వయో సడలింపు :

OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగ అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
SC/ST దివ్యాంగులకు అదనంగా 5 సంవత్సరాలు
OBC దివ్యాంగులకు అదనంగా 3 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

ఈ నియామక ప్రక్రియకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం నెలకు ₹18,000 నుండి ₹56,900 వరకు జీతం చెల్లించబడుతుంది.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:

1. రాత పరీక్ష

2. పత్రాల పరిశీలన (Document Verification)

3. ఇంటర్వ్యూ / నైపుణ్య పరీక్ష (అవసరమైతే) ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన ధృవపత్రాలు మరియు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో కలిసి కింది చిరునామాకు పోస్టు ద్వారా పంపాలి.

పోస్టల్ చిరునామా:

Commandant
IAM, IAF
Vimanapura Post Office
Bangalore – 560017.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 జూన్ 2026

దరఖాస్తుల చివరి తేదీ: 26 జూలై 2026

Notification & Application  Pdf Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *