Central Govt Jobs

NTA Office Assistant Recruitment 2026 : NTAలో 15 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత…Apply Now :

calendar_month November 27, 2026 person chitra

NTA Office Assistant Recruitment 2026 : NTAలో 15 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత…Apply Now :

NTA Office Assistant Recruitment 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నుంచి మంచి ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. NTA తాజాగా ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistant) పోస్టుల భర్తీకి Recruitment Notification 2026 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పే లెవల్-4 ప్రకారం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం లభిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా పంపించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబర్ 10, 2026. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లో ఉద్యోగాలు

నోటిఫికేషన్ పేరు : Office Assistant Recruitment 2026

పోస్టు పేరు : ఆఫీస్ అసిస్టెంట్ (OA)

పోస్టుల వివరాలు : 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కింది పోస్టులను భర్తీ చేయనుంది.

పోస్టు పేరు ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (OA) 15
మొత్తం 15

మొత్తం ఖాళీలు : 15

అధికారిక ఇమెయిల్ : recruitment@nta.ac.in

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2. MS Word, MS Excel, PowerPoint వంటి కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన ఉండాలి.

3. ఇ-మెయిల్, ఇంటర్నెట్ ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించడం తెలిసి ఉండాలి.

4. ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాతపూర్వకంగా మరియు మౌఖికంగా మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

వయోపరిమితి :

NTA Office Assistant ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. అసాధారణ పరిస్థితుల్లో అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కల్పించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం NTA నిబంధనల ప్రకారం ఉంటుంది.

నెల జీతం ఎంత?

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-4 ప్రకారం జీతం చెల్లిస్తారు.

కనీస నెల జీతం: రూ.25,500/-

గరిష్ఠ వేతనం: రూ.81,100/- ఉంటుంది.

ఎంపిక విధానం :

NTA నిర్ణయించిన ఎంపిక విధానం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ప్రధానంగా కింది దశలు ఉండే అవకాశం ఉంది.

1. అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన.

2. అర్హత కలిగిన అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్.

3. వ్యక్తిగత సంభాషణ లేదా ఇంటర్వ్యూ.

ఎంపిక ప్రమాణాలు, షార్ట్‌లిస్టింగ్ విధానం, తదుపరి దశలకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను నిర్ణయించే పూర్తి అధికారం NTAకు ఉంటుంది. ఈ విషయంలో సమర్థ అధికారి తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం.

దరఖాస్తు చేసే విధానం:

1. ముందుగా NTA విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

2. నోటిఫికేషన్‌లోని అనుబంధం-I (Annexure-I) దరఖాస్తు ఫార్మాట్‌ను పొందాలి.

3. అందులో అడిగిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.

4. మీ విద్యార్హతలు, అనుభవం, గుర్తింపునకు సంబంధించిన పత్రాల స్వీయ ధృవీకరించిన (Self-attested) కాపీలను జతచేయాలి.

5. మీ పూర్తి CV లేదా Resume కూడా జతచేయాలి.

6. పూర్తి చేసిన దరఖాస్తును recruitment@nta.ac.in అనే ఇమెయిల్ చిరునామాకు పంపించాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ : 25 నవంబర్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 10 డిసెంబర్ 2026

Notification Pdf : Click Here

Official Website : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *