telangana jobs

తెలంగాణ పోలీస్ SPO డ్రైవర్ నోటిఫికేషన్ 2026 విడుదల.. నెలకు ₹26,000 జీతం | వెంటనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month July 11, 2026 person chitra

తెలంగాణ పోలీస్ SPO డ్రైవర్ నోటిఫికేషన్ 2026 విడుదల.. నెలకు ₹26,000 జీతం | వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Telangana Police SPO Driver Recruitment 2026 :

తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మాజీ సైనికులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బందికి శుభవార్త. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  ” ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)” లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) – డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన మాజీ సైనికులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగ వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ పోలీస్ – ICCC, హైదరాబాద్ లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు: స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) – డ్రైవర్ పోస్టులు

ఉద్యోగ స్థలం: హైదరాబాద్

నెలవారీ గౌరవ వేతనం: ₹26,000

సెలవులు: అత్యవసర సెలవు దినాలకు వేతనం చెల్లించబడదు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

1. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావాలి.

2. మాజీ సైనికులు (Ex-Servicemen) లేదా అర్హత కలిగిన రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు.

3. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

4. ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలు ఉండాలి.

వయోపరిమితి :

1. 31 జూలై 2026 నాటికి అభ్యర్థి వయస్సు 58 సంవత్సరాల లోపు ఉండాలి.

2. రిటైర్డ్ పోలీస్ అధికారులు గత రెండు సంవత్సరాలలోపు పదవీ విరమణ చేసి ఉండాలి.

అవసరమైన ధృవీకరణ పత్రాలు :

దరఖాస్తు సమయంలో కింది పత్రాలు సమర్పించాలి.

1. ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్

2. CAPP డిశ్చార్జ్ సర్టిఫికేట్

3. RPF/RPP రిటైర్మెంట్ ఆర్డర్ (వర్తిస్తే)

4. ఆధార్ కార్డు

5. పాన్ కార్డు

6. టెక్నికల్ ట్రేడ్ లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్

7. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్

8. ఇటీవల తీసుకున్న మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

దరఖాస్తు విధానం :

అభ్యర్థులు తమ దరఖాస్తులను 12 జూలై 2026 నుంచి 19 జూలై 2026 వరకు బంజారాహిల్స్, రోడ్ నం.12లోని సంబంధిత కార్యాలయంలో ప్రత్యక్షంగా సమర్పించాలి.

సంప్రదింపు వివరాలు :

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సందేహాల కోసం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ రెడ్డిను 8712674111 నంబర్‌లో సంప్రదించవచ్చు.

తెలంగాణ పోలీస్ శాఖలో SPO డ్రైవర్ ఉద్యోగం పొందాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *