తెలంగాణ పోలీస్ SPO డ్రైవర్ నోటిఫికేషన్ 2026 విడుదల.. నెలకు ₹26,000 జీతం | వెంటనే దరఖాస్తు చేసుకోండి!
తెలంగాణ పోలీస్ SPO డ్రైవర్ నోటిఫికేషన్ 2026 విడుదల.. నెలకు ₹26,000 జీతం | వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Telangana Police SPO Driver Recruitment 2026 :
తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మాజీ సైనికులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బందికి శుభవార్త. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ” ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)” లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) – డ్రైవర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన మాజీ సైనికులు, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ పోలీస్ – ICCC, హైదరాబాద్ లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) – డ్రైవర్ పోస్టులు
ఉద్యోగ స్థలం: హైదరాబాద్
నెలవారీ గౌరవ వేతనం: ₹26,000
సెలవులు: అత్యవసర సెలవు దినాలకు వేతనం చెల్లించబడదు.
విద్య అర్హతలు :
1. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావాలి.
2. మాజీ సైనికులు (Ex-Servicemen) లేదా అర్హత కలిగిన రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు.
3. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
4. ఆధార్ కార్డు మరియు ఓటర్ ఐడీ వంటి గుర్తింపు పత్రాలు ఉండాలి.
వయోపరిమితి :
1. 31 జూలై 2026 నాటికి అభ్యర్థి వయస్సు 58 సంవత్సరాల లోపు ఉండాలి.
2. రిటైర్డ్ పోలీస్ అధికారులు గత రెండు సంవత్సరాలలోపు పదవీ విరమణ చేసి ఉండాలి.
అవసరమైన ధృవీకరణ పత్రాలు :
దరఖాస్తు సమయంలో కింది పత్రాలు సమర్పించాలి.
1. ఎక్స్ సర్వీస్ మెన్ డిశ్చార్జ్ బుక్
2. CAPP డిశ్చార్జ్ సర్టిఫికేట్
3. RPF/RPP రిటైర్మెంట్ ఆర్డర్ (వర్తిస్తే)
4. ఆధార్ కార్డు
5. పాన్ కార్డు
6. టెక్నికల్ ట్రేడ్ లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్
7. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్
8. ఇటీవల తీసుకున్న మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు తమ దరఖాస్తులను 12 జూలై 2026 నుంచి 19 జూలై 2026 వరకు బంజారాహిల్స్, రోడ్ నం.12లోని సంబంధిత కార్యాలయంలో ప్రత్యక్షంగా సమర్పించాలి.
సంప్రదింపు వివరాలు :
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సందేహాల కోసం రిజర్వ్ ఇన్స్పెక్టర్ గోపాల్ రెడ్డిను 8712674111 నంబర్లో సంప్రదించవచ్చు.
తెలంగాణ పోలీస్ శాఖలో SPO డ్రైవర్ ఉద్యోగం పొందాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.