Talliki Vandanam Scheme 2026: ప్రభుత్వం కీలక ప్రకటన.. తల్లికి వందనం కింద రూ.13,000 జమ.. మీరు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి.
Talliki Vandanam Scheme 2026: ప్రభుత్వం కీలక ప్రకటన.. తల్లికి వందనం కింద రూ.13,000 జమ.. మీరు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి.
తల్లికి వందనం పథకం 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో త్వరలో రూ.13,000 జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకానికి మీ పిల్లలు అర్హులా కాదా అనే విషయాన్ని వారు చదువుతున్న పాఠశాల ద్వారానే సులభంగా తెలుసుకోవచ్చు.
తల్లికి వందనం అర్హత ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థుల అర్హతను పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Head Master) CSE పోర్టల్ ద్వారా పరిశీలించవచ్చు.
పరిశీలించే విధానం:
1. CSE వెబ్‌సైట్‌లో హెడ్‌మాస్టర్ లాగిన్ అవ్వాలి.
2. హోమ్‌పేజీలో ఉన్న Services మెనూను ఎంచుకోవాలి.
3. అక్కడ కనిపించే “Talliki Vandanam” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. అనంతరం విద్యార్థి ఎంపిక (Selection Status) వివరాలు కనిపిస్తాయి.
5. ప్రతి విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సాయం
6. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
7. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు.
8. అర్హత పొందిన ప్రతి విద్యార్థి కోసం రూ.13,000ను నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
9. రూ.2,000 పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించబడుతుంది.
10. బ్యాంక్ ఖాతాకు ఆధార్, NPCI లింక్ తప్పనిసరి
తల్లికి వందనం పథకం ద్వారా నగదు అందుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
1. తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి.
2. NPCI Aadhaar Seeding పూర్తి కావాలి.
3. బ్యాంక్ e-KYC వివరాలు అప్డేట్ అయి ఉండాలి.
ఈ ప్రక్రియలు పూర్తయిన వారికి మాత్రమే పథకం నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది.
నిధుల విడుదలపై తాజా సమాచారం :
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (Mega PTM) వాయిదా పడినట్లు సమాచారం.
అదే సమయంలో తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, మెగా PTM నిర్వహణతో సంబంధం లేకుండా ప్రభుత్వం మరో తేదీన అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
SC, ST విద్యార్థులకు ముఖ్య సూచనలు :
తల్లికి వందనం పథకం ప్రయోజనం పొందాలనుకునే SC, ST విద్యార్థులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గమనించాలి.
1. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన అర్హులైన విద్యార్థులు తమ పేరుపై బ్యాంకు లేదా
2. పోస్టల్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి.
3. ఆ ఖాతాకు NPCI లింకింగ్ పూర్తి చేయాలి.
4. 18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా తల్లిదండ్రుల బయోమెట్రిక్ ధృవీకరణతో ఖాతా తెరవచ్చు.
5. ఖాతా ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా NPCI మ్యాపింగ్ పూర్తి చేయాలి.
6. NPCI లింకింగ్ పూర్తి కాకపోతే పథకం నిధులు ఖాతాలో జమ కావని అధికారులు స్పష్టం చేశారు.
ముఖ్య గమనిక :
తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలంటే అర్హత జాబితాలో పేరు ఉండటంతో పాటు, బ్యాంకు ఖాతా, ఆధార్ లింకింగ్, NPCI సీడింగ్, e-KYC వంటి అన్ని వివరాలు సక్రమంగా పూర్తి చేసి ఉండాలి. నిధుల విడుదల తేదీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.