Army Sainik School Recruitment 2026: సైనిక్ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీ.. 12వ తరగతి, డిగ్రీ అర్హతతో దరఖాస్తు అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి.
Army Sainik School Recruitment 2026: సైనిక్ స్కూల్లో ల్యాబ్ అసిస్టెంట్ సహా పలు పోస్టుల భర్తీ.. 12వ తరగతి, డిగ్రీ అర్హతతో దరఖాస్తు అవకాశం…వెంటనే అప్లై చేసుకోండి.
Army Sainik School Latest Recruitment 2026:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ చిత్తోర్‌గఢ్ వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో TGT (గణితం), TGT (హిందీ), కౌన్సెలర్, ల్యాబ్ అసిస్టెంట్, PEM/PTI కమ్ మేట్రాన్ మరియు నర్సింగ్ సిస్టర్ (మహిళ) పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
TGT (గణితం) – 01
TGT (హిందీ) – 01
కౌన్సెలర్ – 01
ల్యాబ్ అసిస్టెంట్ – 01
PEM/PTI కమ్ మేట్రాన్ – 01
నర్సింగ్ సిస్టర్ (మహిళ) – 01
మొత్తం పోస్టులు : 06
విద్య అర్హతలు :
TGT (గణితం):
1. గణితంలో కనీసం 50% మార్కులతో డిగ్రీ B.Ed (గణితం)
2. CTET అర్హత
TGT (హిందీ):
1. హిందీలో కనీసం 50% మార్కులతో డిగ్రీ, B.Ed (హిందీ)
2. CTET అర్హత
కౌన్సెలర్:
1. సైకాలజీలో గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్
2. లేదా బాలల అభివృద్ధి/కెరీర్ గైడెన్స్ & కౌన్సెలింగ్‌లో డిప్లొమా
ల్యాబ్ అసిస్టెంట్:
1. 12వ తరగతి ఉత్తీర్ణత
2. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్ హార్డ్‌వేర్ & నెట్వర్కింగ్లో ఐటీఐ లేదా ఒక సంవత్సరం డిప్లొమా
PEM/PTI కమ్ మేట్రాన్:
1. 10వ తరగతి ఉత్తీర్ణత
2. ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం
3. హాస్టల్ వార్డెన్ అనుభవం, క్రీడల్లో ప్రావీణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత
నర్సింగ్ సిస్టర్ (మహిళ):
1. గుర్తింపు పొందిన సంస్థ నుంచి నర్సింగ్ డిప్లొమా లేదా డిగ్రీ
2. లేదా మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్‌లో కనీసం 5 సంవత్సరాల సేవ చేసిన మాజీ సైనికులు
వయోపరిమితి :
01 జూలై 2026 నాటికి: 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / OBC అభ్యర్థులు – ₹500/-
2. SC / ST అభ్యర్థులు – ₹250/-
3. దరఖాస్తు రుసుమును “Sainik School Chittorgarh” పేరిట Demand Draft రూపంలో జత చేసి పంపాలి.
నెలవారీ జీతం :
పోస్టును బట్టి ₹36,000 నుంచి ₹66,000 వరకు నెలవారీ వేతనం అందజేస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4. మెడికల్ పరీక్ష
5. డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫారాన్ని A4 సైజు పేపర్‌పై రెండు వైపులా ప్రింట్ చేసుకోవాలి.
2. అసలు సర్టిఫికెట్ల ప్రకారం అన్ని వివరాలను నీలి రంగు పెన్నుతో BLOCK CAPITAL LETTERS లో మాత్రమే నింపాలి.
3. అవసరమైన పత్రాలు, డిమాండ్ డ్రాఫ్ట్ జత చేసి నిర్ణీత చిరునామాకు పంపాలి.
పోస్టల్ చిరునామా :
Sainik School Chittorgarh
Bhilwara Road,
Chittorgarh, Rajasthan – 312021.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 25 జూలై 2026
దరఖాస్తుల చివరి తేదీ: 15 ఆగస్టు 2026
Notification & Application Pdf Click Here
Official Website Click Here