Bank Jobs

విజయనగరం DCCB బ్యాంక్‌లో 25 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు ₹47,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ లేదు…Apply Now | Vizianagaram DCCB Recruitment 2026

calendar_month July 26, 2026 person chitra

విజయనగరం DCCB బ్యాంక్‌లో 25 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు ₹47,000 వరకు జీతం.. ఇంటర్వ్యూ లేదు…Apply Now | Vizianagaram DCCB Recruitment 2026 :

Vizianagaram DCCB Recruitment 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ది డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (DCCB), విజయనగరం 2026 సంవత్సరానికి స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థులు 2026 జూలై 24 నుండి ఆగస్టు 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు సుమారు ₹47,000 వరకు వేతనం లభిస్తుంది. ముఖ్యంగా ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉండదు. కేవలం ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

DCCB విజయనగరం రిక్రూట్‌మెంట్ 2026 – ముఖ్య వివరాలు :

సంస్థ పేరు : District Co-operative Central Bank (DCCB), Vizianagaram

పోస్టు పేరు : Staff Assistant

మొత్తం ఖాళీలు : 25

ఉద్యోగ స్థలం : విజయనగరం జిల్లా

దరఖాస్తు విధానం : Online

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (Graduation) పూర్తి చేసి ఉండాలి.

2. 24 జూలై 2026 నాటికి విద్యార్హత పూర్తి అయి ఉండాలి.

3. తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలి.

4. ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.

5. కంప్యూటర్‌పై Working Knowledge ఉండాలి.

Local Candidate అర్హత :

ఈ ఉద్యోగాలకు ” పాత విజయనగరం జిల్లా (Erstwhile Vizianagaram District) ” కు చెందిన స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అవసరమైతే క్రింది ధృవపత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి.

1. Bonafide Study Certificate

2. Residence Certificate (MRO/తహసీల్దార్ జారీ చేసినది)

వయోపరిమితి :

01 జూన్ 2026 నాటికి వయస్సు కనీస వయస్సు: 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

వయో సడలింపు : 

కేటగిరీ సడలింపు
SC/ST 5 సంవత్సరాలు
BC 3 సంవత్సరాలు
PwBD (General) 10 సంవత్సరాలు
PwBD (BC) 13 సంవత్సరాలు
PwBD (SC/ST) 15 సంవత్సరాలు
మాజీ సైనికులు నిబంధనల ప్రకారం

దరఖాస్తు ఫీజు : 

కేటగిరీ ఫీజు
SC / ST / PwBD / Ex-Servicemen ₹590
OC / BC / EWS ₹826

ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

జీతం వివరాలు : 

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు.

1. బేసిక్ పే: ₹24,050,   గరిష్ట పే స్కేల్: ₹64,480

2. ప్రారంభ వేతనం (DA, HRAతో కలిపి): సుమారు ₹47,000

3. బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉండదు.

ఎంపిక కేవలం:

1. Online Written Examination

2. మెరిట్ ఆధారం గా

3. రిజర్వేషన్ నిబంధనలు ఆధారంగా జరుగుతుంది.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

1. అధికారిక వెబ్‌సైట్‌ (  Vizianagaram DCCB Official Website ) ను సందర్శించండి.

2.New Registration పూర్తి చేయండి.

3. వ్యక్తిగత వివరాలు నమోదు చేయండి.

4. ఫోటో, సంతకం, Thumb Impression అప్లోడ్ చేయండి.

5. Hand Written Declaration అప్లోడ్ చేయండి.

6. దరఖాస్తును పరిశీలించి Submit చేయండి.

7. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించండి.

8. చివరిగా Application Print తీసుకొని భద్రపరచుకోండి.

హాల్ టికెట్ / కాల్ లెటర్ :

ఆన్‌లైన్ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు తమ Registration Number మరియు Password/Date of Birth ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి Call Letter డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్షకు సుమారు 7 నుంచి 10 రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేసే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 జూలై 2026

దరఖాస్తు చివరి తేదీ : 07 ఆగస్టు 2026

ఫీజు చెల్లింపు చివరి తేదీ : 07 ఆగస్టు 2026

Notification

Apply Now

Official Website

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *