BEL Recruitment 2026: గ్రామీణ విద్యుత్ శాఖలో 350 ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు.. B.E/B.Tech అర్హతతో అప్లై చేయండి!
BEL Recruitment 2026: గ్రామీణ విద్యుత్ శాఖలో 350 ప్రొబేషనరీ ఇంజనీర్ ఉద్యోగాలు.. B.E/B.Tech అర్హతతో అప్లై చేయండి!
BEL Probationary Engineer Recruitment 2026:
ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజనీరింగ్ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు BEL అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేయాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 28, 2026న ప్రారంభమై నవంబర్ 18, 2026న ముగుస్తుంది. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఉద్యోగాలు
పోస్టుల పేరు: ప్రొబేషనరీ ఇంజనీర్ (Probationary Engineer)
పోస్టుల వివరాలు :
BEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 350 ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| ప్రొబేషనరీ ఇంజనీర్ – ఎలక్ట్రానిక్స్ | 200 |
| ప్రొబేషనరీ ఇంజనీర్ – మెకానికల్ | 150 |
| మొత్తం | 350 |
మొత్తం ఖాళీలు: 350
ఉద్యోగ విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎలక్ట్రానిక్స్ పోస్టులకు:
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్ విభాగాల్లో B.E./B.Tech./B.Sc. ఇంజనీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) అర్హత ఉండాలి.
మెకానికల్ పోస్టులకు:
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో B.E./B.Tech./B.Sc. ఇంజనీరింగ్ (4 సంవత్సరాల కోర్సు) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
BEL ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులకు 2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి అన్రిజర్వ్డ్, EWS అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు.
రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన వయోపరిమితి సడలింపులు ఈ విధంగా ఉన్నాయి:
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల సడలింపు.
OBC (NCL) అభ్యర్థులకు: 3 సంవత్సరాల సడలింపు.
PwBD అభ్యర్థులకు: నిబంధనల ప్రకారం 10 సంవత్సరాల సడలింపు.
రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన PwBD అభ్యర్థులకు: వర్తించే నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు రుసుము :
నోటిఫికేషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం జనరల్, EWS, OBC (NCL) కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.1,000తో పాటు GST చెల్లించాలి. GSTతో కలిపి మొత్తం రుసుము రూ.1,180 అవుతుంది.
జీతం వివరాలు :
BEL ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు E-II గ్రేడ్‌లో వేతనం చెల్లిస్తారు. ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ.40,000గా ఉంటుంది. వేతన స్కేల్ రూ.40,000–3%–రూ.1,40,000గా పేర్కొన్నారు.
ఇతర అలవెన్సులు, ప్రయోజనాలతో కలిపి వార్షిక CTC సుమారు రూ.13 లక్షల వరకు ఉండవచ్చు. ఖచ్చితమైన వేతనం, ఇతర ప్రయోజనాలు సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.
ఎంపిక విధానం :
BEL ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థులను ప్రధానంగా రెండు దశల్లో ఎంపిక చేస్తారు.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer-Based Test – CBT)
2. ఇంటర్వ్యూ
అర్హత ప్రమాణాలను పూర్తి చేసి, ఆన్లైన్ దరఖాస్తులు ఆమోదించబడిన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్షకు పరిగణనలోకి తీసుకుంటారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూలో విడివిడిగా కనీస అర్హత మార్కులు సాధించాలి.
జనరల్/OBC/EWS అభ్యర్థులకు: 35 శాతం.
SC/ST/PwBD అభ్యర్థులకు: 30 శాతం.
CBTలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా విభాగం, కేటగిరీ వారీగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు తాత్కాలికంగా ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు కింది విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ముందుగా BEL అధికారిక వెబ్సైట్ https://www.bel-india.in/ ను సందర్శించాలి.
2. వెబ్‌సైట్‌లోని Careers విభాగాన్ని తెరవాలి.
3. Probationary Engineer Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.
4. నోటిఫికేషన్లో పేర్కొన్న సూచనలు, అర్హత ప్రమాణాలను పూర్తిగా చదవాలి.
5. ఆన్లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
6. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
7. అవసరమైన పత్రాలను సూచించిన విధంగా సమర్పించాలి.
8. వర్తించే దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
9. నమోదు చేసిన వివరాలను మరోసారి పరిశీలించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
10. భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారం, చెల్లింపు రసీదును భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 28 అక్టోబర్ 2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18 నవంబర్ 2026
Notification Pdf : Click Here
Apply Link : Click Here