Railway Jobs : ఇంటర్ అర్హతతో రైల్వే లో 312 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Railway Isolated Category Jobs Notification 2025 Apply Now

Railway Jobs : ఇంటర్ అర్హతతో రైల్వే లో 312 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Railway Isolated Category Jobs Notification 2025 Apply Now

ఇంటర్ అర్హతతో రైల్వే లో 312 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 – ముఖ్య వివరాలు:

రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందాలని ఆశించే అభ్యర్థులకు శుభవార్త. ఇంటర్ అర్హతతో రైల్వే లో 312 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను Railway Isolated Category Jobs Notification 2025 పేరుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. అంతేకాదు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హత కలిగిన ప్రతి ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కూడా 18-35 సంవత్సరాల మధ్య ఉంటే చాలు. ఇందులో రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Railway Isolated Category Jobs 2025 ముఖ్య సూచనలు:

ఈ రైల్వే నోటిఫికేషన్ ద్వారా మొత్తం 312 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి ప్రధానంగా Isolated Category పోస్టులు, అంటే నిర్దిష్ట విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు. కొన్ని పోస్టులకు అదనంగా డిప్లొమా లేదా డిగ్రీ అర్హత అవసరం ఉండవచ్చు.

సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. సైంటిఫిక్ సూపర్ వైజర్
2. సైంటిఫిక్ అసిస్టెంట్
3. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3
4. జూనియర్ ట్రాన్స్ లేటర్ మరియు ఇతర పోస్టులు

మొత్తం పోస్టులు : 312

విద్య అర్హతలు:

A ) సైంటిఫిక్ సూపర్ వైజర్ :

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc (Physics / Chemistry / Mathematics / Electronics)
లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (B.E / B.Tech)

2. కొన్ని విభాగాలకు సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

3. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు.

B )సైంటిఫిక్ అసిస్టెంట్ :

1. ఇంటర్మీడియట్ (10+2) – సైన్స్ గ్రూప్ (Physics, Chemistry, Mathematics) తో పూర్తి చేసి ఉండాలి
లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా / B.Sc డిగ్రీ

2. ల్యాబ్ పనులపై ప్రాథమిక అవగాహన ఉండాలి.

3. కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం ఉంటే మంచిది.

C ) ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ – 3

1. ఇంటర్ అర్హత (10+2) – సైన్స్ సబ్జెక్టులతో (Physics, Chemistry, Biology / Mathematics)

2. ప్రయోగశాల పనులపై అవగాహన ఉండాలి.

3. సంబంధిత ల్యాబ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

4. ఈ పోస్టు ప్రధానంగా ఇంటర్ అర్హతతో అప్లై చేసుకునే వారికి చాలా మంచి అవకాశం.

D )జూనియర్ ట్రాన్స్‌లేటర్:

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ తప్పనిసరి.

2. హిందీ లేదా ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా హిందీ ↔ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా / సర్టిఫికెట్ కోర్స్.

3. అధికార భాషలపై మంచి పట్టు ఉండాలి.

E )ఇతర పోస్టులు (Other Isolated Category Posts):

1. సంబంధిత పోస్టుకు అనుగుణంగా ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ అర్హతలు.

2. సంబంధిత విభాగంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ తప్పనిసరి.

3. పోస్టుల వారీగా పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో ఇవ్వబడతాయి.

వయో పరిమితి:

Railway Isolated Category Jobs 2025 కి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఇతర రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. జనరల్ / OBC అభ్యర్థులకు ₹500

2. SC / ST / మహిళా అభ్యర్థులకు ₹250

3. CBT కు హాజరైన వారికి కొంత ఫీజు రిఫండ్ కూడా ఉంటుంది.

శాలరీ వివరాలు:

Railway Isolated Category ఉద్యోగాలకు 7వ వేతన సంఘం ప్రకారం జీతం చెల్లించబడుతుంది.

కనీస వేతనం ₹35,000 నుంచి

పోస్టు ఆధారంగా ₹55,000 వరకు

DA, HRA, TA వంటి అలవెన్సులు అదనంగా ఉంటాయి.

ఎంపిక విధానం:

ఈ రైల్వే ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.

1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

2. ట్రేడ్స్ / స్కిల్ టెస్ట్ (అవసరమైన పోస్టులకు)

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. CBT లో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, సంబంధిత సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం:

Railway Isolated Category Jobs Notification 2025 కి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.

1. అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in కు వెళ్లాలి.

2. కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి.

3. అవసరమైన వివరాలు నమోదు చేయాలి.

4. డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.

5. దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 30 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 29 జనవరి 2026.

Notification pdf : Click Here

Apply Link : Click Here

Leave a Comment