Telangana Prisons Warder Recruitment 2026: జైళ్లశాఖలో 208 వార్డర్ ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం!
Telangana Prisons Warder Recruitment 2026: జైళ్లశాఖలో 208 వార్డర్ ఉద్యోగాలు.. ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకునే అవకాశం!
తెలంగాణ జైళ్లశాఖ వార్డర్ రిక్రూట్మెంట్ 2026 పోస్టుల వివరాలు :
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) జైళ్లశాఖలో 208 వార్డర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలలో 196 పురుష వార్డర్ పోస్టులు, 12 మహిళా వార్డర్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు వేతనం అందించనున్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
తెలంగాణ జైళ్లశాఖలో మొత్తం 208 పోస్టులు భర్తీ చేయనున్నారు.
వార్డర్ (పురుషులు) – 196 పోస్టులు
వార్డర్ (మహిళలు) – 12 పోస్టులు
మొత్తం పోస్టులు : 208
విద్య అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 29 జూలై 2026 నాటికి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్ (10+2) లేదా సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు, పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి :
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీవో నెం.87 ఆధారంగా సాధారణ వయోపరిమితికి అదనంగా 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
3. అలాగే SC, ST, BC, EWS అభ్యర్థులకు కూడా నిబంధనల మేరకు అదనపు వయోసడలింపు లభిస్తుంది.
నెల జీతం :
1. ఎంపికైన అభ్యర్థులకు రూ.24,280 నుంచి రూ.72,850 వరకు నెలవారీ వేతనం చెల్లిస్తారు.
2. ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా వర్తించే అవకాశం ఉంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది దశల ద్వారా ఎంపిక చేస్తారు.
1. ప్రిలిమినరీ రాత పరీక్ష
2. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT)
3. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఫిజికల్ అర్హతలు :
పురుష అభ్యర్థులు : 1600 మీటర్ల పరుగు – 7 నిమిషాలు 15 సెకన్లలో పూర్తి చేయాలి.
కనీస ఎత్తు – 167.6 సెం.మీ
మహిళా అభ్యర్థులు :
800 మీటర్ల పరుగు – 5 నిమిషాలు 20 సెకన్లలో పూర్తి చేయాలి.
కనీస ఎత్తు – 152.5 సెం.మీ
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
అధికారిక వెబ్‌సైట్: https://www.tgprb.in/
ముఖ్యమైన తేదీ :
నోటిఫికేషన్ విడుదల తేదీ: 29 జూలై 2026
Notification Pdf Click Here
Apply Online Link Click Here