విజయవాడలో భారీ జాబ్‌మేళా.. 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం! మిస్ అవ్వొద్దు..!
విజయవాడలో భారీ జాబ్‌మేళా.. 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం! మిస్ అవ్వొద్దు..!
విజయవాడలో భారీ జాబ్‌మేళా 2026 :
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశం. విజయవాడ కొత్తపేటలోని KBN కాలేజీలో సెప్టెంబర్ 26, 2026న భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.
మొత్తం 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా వివిధ పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.13,000 నుంచి రూ.35,000 వరకు జీతం లభించే అవకాశముంది. కొన్ని కంపెనీల్లో మహిళలకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్‌మేళాకు హాజరుకావచ్చు.
జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగాలు :
| కంపెనీ | పోస్టులు | ఖాళీలు | విద్యార్హత | వయస్సు | జీతం |
|---|---|---|---|---|---|
| Accenture | Customer Service Executive | 50 | డిగ్రీ | 18–25 | ₹30,000 |
| Blue Star | Assembly Operator | 25 | SSC, ITI, Diploma, B.Tech | 18–25 | ₹21,000 |
| Dixon | Assembly Operator | 100 | SSC, Inter, ITI, Degree | 18–27 | ₹15,000 |
| Forbes Marshall | Testing Engineering Support | 50 | Diploma/B.Tech | 18–28 | ₹30,000 |
| Foxconn | Quality/Assembly Operator | 50 | ITI/Diploma/Degree, మహిళలు | 18–26 | ₹16,000 |
| ICICI Bank | Relationship Manager | 25 | ఏదైనా డిగ్రీ (B.Tech అర్హత లేదు) | 25 లోపు | ₹27,000 |
| Innovsource Services | Branch Relationship Executive, Team Leader, TeleCallers | 20 | Inter/Any Degree | 18–35 | ₹35,000 |
| Isuzu Motors | Technician | 50 | ITI/Diploma/Any Degree | 18–25 | ₹15,000 |
| Navata Transport | Supervisors | 25 | Inter/ITI/Diploma | 18–30 | ₹13,000 |
| Paytm | Sales Executive, Customer Engagement Manager | 25 | Inter/Any Degree | 18–28 | ₹34,000 |
| Premier Energies | Technician | 50 | SSC/Inter, ITI, B.Tech (EEE/Mechanical/ECE) | 18–27 | ₹18,354 |
| Skillza Global Pvt. Ltd. | Trainee Engineers, ITI Technicians, Trainee Chemists, Field Sales తదితరాలు | 500 | Inter, ITI, Diploma, B.Tech, Degree Freshers | 18–35 | ₹35,000 |
| Suzlon | Technical Team Manager | 36 | Diploma | 19–27 | ₹18,000 |
| TATA Electronics | Junior Technician | 100 | Inter/Diploma/ITI, మహిళలు | 18–30 | ₹16,000 |
| Technotask | Customer Support Associate | 30 | Inter/Degree | 18–30 | ₹20,000 |
| THK | Machine Operator | 50 | Diploma/B.Tech (Mech, EEE) | 18–26 | ₹18,000 |
| Varun Motors | Service Advisors, Technicians, Telecallers, Sales, Drivers, Electricians తదితరాలు | 189 | SSC నుంచి Degree వరకు | 18–30 | ₹35,000 |
జాబ్‌మేళా పూర్తి వివరాలు :
తేదీ: 26 సెప్టెంబర్ 2026
వేదిక: KBN College, Kothapet, Vijayawada
పాల్గొనే కంపెనీలు: 17
మొత్తం ఉద్యోగ ఖాళీలు: 1,375
సంప్రదించాల్సిన ఫోన్: 9700092606
అభ్యర్థులు ఏం చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 26న KBN కాలేజీ, కొత్తపేట, విజయవాడలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. తమ విద్యార్హతకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుని సంబంధిత కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాలి.
అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ వంటి అవసరమైన పత్రాలు వెంట తీసుకెళ్లడం మంచిది. మరిన్ని వివరాలు లేదా జాబ్‌మేళాకు సంబంధించిన సందేహాల కోసం 9700092606 నంబర్‌కు సంప్రదించవచ్చు.