Private Jobs

విజయవాడలో భారీ జాబ్‌మేళా.. 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం! మిస్ అవ్వొద్దు..!

calendar_month September 25, 2026 person chitra

విజయవాడలో భారీ జాబ్‌మేళా.. 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగాలు.. నెలకు రూ.35,000 వరకు జీతం! మిస్ అవ్వొద్దు..!

విజయవాడలో భారీ జాబ్‌మేళా 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు మంచి అవకాశం. విజయవాడ కొత్తపేటలోని KBN కాలేజీలో సెప్టెంబర్ 26, 2026న భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.

మొత్తం 17 కంపెనీల్లో 1,375 ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech వంటి విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా వివిధ పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.13,000 నుంచి రూ.35,000 వరకు జీతం లభించే అవకాశముంది. కొన్ని కంపెనీల్లో మహిళలకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్‌మేళాకు హాజరుకావచ్చు.

జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగాలు :

కంపెనీ పోస్టులు ఖాళీలు విద్యార్హత వయస్సు జీతం
Accenture Customer Service Executive 50 డిగ్రీ 18–25 ₹30,000
Blue Star Assembly Operator 25 SSC, ITI, Diploma, B.Tech 18–25 ₹21,000
Dixon Assembly Operator 100 SSC, Inter, ITI, Degree 18–27 ₹15,000
Forbes Marshall Testing Engineering Support 50 Diploma/B.Tech 18–28 ₹30,000
Foxconn Quality/Assembly Operator 50 ITI/Diploma/Degree, మహిళలు 18–26 ₹16,000
ICICI Bank Relationship Manager 25 ఏదైనా డిగ్రీ (B.Tech అర్హత లేదు) 25 లోపు ₹27,000
Innovsource Services Branch Relationship Executive, Team Leader, TeleCallers 20 Inter/Any Degree 18–35 ₹35,000
Isuzu Motors Technician 50 ITI/Diploma/Any Degree 18–25 ₹15,000
Navata Transport Supervisors 25 Inter/ITI/Diploma 18–30 ₹13,000
Paytm Sales Executive, Customer Engagement Manager 25 Inter/Any Degree 18–28 ₹34,000
Premier Energies Technician 50 SSC/Inter, ITI, B.Tech (EEE/Mechanical/ECE) 18–27 ₹18,354
Skillza Global Pvt. Ltd. Trainee Engineers, ITI Technicians, Trainee Chemists, Field Sales తదితరాలు 500 Inter, ITI, Diploma, B.Tech, Degree Freshers 18–35 ₹35,000
Suzlon Technical Team Manager 36 Diploma 19–27 ₹18,000
TATA Electronics Junior Technician 100 Inter/Diploma/ITI, మహిళలు 18–30 ₹16,000
Technotask Customer Support Associate 30 Inter/Degree 18–30 ₹20,000
THK Machine Operator 50 Diploma/B.Tech (Mech, EEE) 18–26 ₹18,000
Varun Motors Service Advisors, Technicians, Telecallers, Sales, Drivers, Electricians తదితరాలు 189 SSC నుంచి Degree వరకు 18–30 ₹35,000

జాబ్‌మేళా పూర్తి వివరాలు :

తేదీ: 26 సెప్టెంబర్ 2026

వేదిక: KBN College, Kothapet, Vijayawada

పాల్గొనే కంపెనీలు: 17

మొత్తం ఉద్యోగ ఖాళీలు: 1,375

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

సంప్రదించాల్సిన ఫోన్: 9700092606

అభ్యర్థులు ఏం చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 26న KBN కాలేజీ, కొత్తపేట, విజయవాడలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. తమ విద్యార్హతకు సరిపోయే ఉద్యోగాన్ని ఎంచుకుని సంబంధిత కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలో పాల్గొనాలి.

అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ వంటి అవసరమైన పత్రాలు వెంట తీసుకెళ్లడం మంచిది. మరిన్ని వివరాలు లేదా జాబ్‌మేళాకు సంబంధించిన సందేహాల కోసం 9700092606 నంబర్‌కు సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *