Central Govt Jobs

Sainik School Jobs 2026: 10వ తరగతి అర్హతతో వార్డ్ బాయ్స్, ఆయా ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.

calendar_month October 10, 2026 person chitra

Sainik School Jobs 2026: 10వ తరగతి అర్హతతో వార్డ్ బాయ్స్, ఆయా ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.

Sainik School Chhingchhip Recruitment 2026:

పదో తరగతి అర్హతతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మిజోరంలోని సైనిక్ స్కూల్ ఛింగ్‌ఛిప్‌లో వార్డ్ బాయ్స్, జనరల్ ఎంప్లాయీ (ఆయా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు 2026 అక్టోబర్ 23 చివరి తేదీగా నిర్ణయించారు.

ఈ నోటిఫికేషన్‌లోని పోస్టుల వివరాలు, అర్హతలు, వయోపరిమితి, వేతనం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

సైనిక్ స్కూల్ ఛింగ్‌ఛిప్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు.

వార్డ్ బాయ్స్: 4 పోస్టులు (పురుష అభ్యర్థులకు)

జనరల్ ఎంప్లాయీ (ఆయా): 1 పోస్టు (మహిళా అభ్యర్థులకు)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు: 05

విద్య అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వార్డ్ బాయ్ పోస్టులకు సంబంధించి రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్‌లో ఇలాంటి ఉద్యోగం చేసిన అనుభవం, కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి :

వార్డ్ బాయ్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సును లెక్కించడానికి నోటిఫికేషన్‌లో పేర్కొన్న చివరి తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు.

దరఖాస్తు రుసుము :

అభ్యర్థులు దరఖాస్తుతో పాటు తిరిగి చెల్లించని రూ.500 ఫీజును చెల్లించాలి. ఈ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నోటిఫికేషన్‌లో సూచించిన ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా సమర్పించాలి.

జీతం వివరాలు :

వార్డ్ బాయ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.28,800 వేతనం చెల్లిస్తారు. జనరల్ ఎంప్లాయీ (ఆయా) పోస్టుకు సంబంధించిన వేతన వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.

ఎంపిక విధానం : 

దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉంది. ఎంపిక విధానం, ఇతర మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.

ఎంపిక ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రయాణ భత్యం చెల్లించరు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అర్హత కలిగిన అభ్యర్థులు కింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

1. సైనిక్ స్కూల్ ఛింగ్‌ఛిప్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. వెబ్‌సైట్‌లోని నోటీస్ బోర్డులో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

3. అందులో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

4. ఫారమ్‌లో అడిగిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి.

5. పదో తరగతి మార్కుల మెమోతో పాటు అవసరమైన విద్యార్హతలు, ఇతర ధ్రువీకరణ పత్రాల స్వీయ ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలి.

6. రూ.500 దరఖాస్తు ఫీజుకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెల్లింపు రసీదును జతచేయాలి.

7. పూర్తి చేసిన దరఖాస్తును చివరి తేదీలోపు కింది చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

ది ప్రిన్సిపాల్,
సైనిక్ స్కూల్ ఛింగ్‌ఛిప్,
ఛింగ్‌ఛిప్ విలేజ్, సెర్చిప్ జిల్లా,
మిజోరం – 796161.

ముఖ్యమైన తేదీ :

దరఖాస్తులకు చివరి తేదీ: 23 అక్టోబర్ 2026

సంప్రదించాల్సిన వివరాలు :

ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలు, ఇతర వివరాల కోసం 7630010072 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *