telangana jobs

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణలో 264 అంగన్వాడీ ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు వివరాలు:

calendar_month October 11, 2026 person chitra

Telangana Anganwadi Jobs 2026: తెలంగాణలో 264 అంగన్వాడీ ఉద్యోగాలు.. అర్హత, దరఖాస్తు వివరాలు:

Telangana Anganwadi Jobs 2026:

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు ముఖ్యమైన సమాచారం. వికారాబాద్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 264 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో 102 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 162 అంగన్వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన స్థానిక మహిళలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామకాలకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు

జిల్లా : వికారాబాద్

ఖాళీల వివరాలు :

అంగన్వాడీ టీచర్ పోస్టులు : 102

అంగన్వాడీ ఆయా పోస్టులు : 162

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 264

విద్య అర్హతలు & వయో పరిమితి:

అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ ఆయా పోస్టులకు అవసరమైన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 2026 జూలై 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కేటగిరీల వారీగా వయో సడలింపులు, ఇతర అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ ఆధారంగా నిర్ధారించుకోవాలి.

స్థానిక మహిళలకే అవకాశం ;

ఈ నియామకాల్లో సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలో నివసించే స్థానిక మహిళలకు మాత్రమే అర్హత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ పరిధి, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు పరిధిలో నివసించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

కొన్ని పోస్టులకు సంబంధిత గ్రామం లేదా నిర్దిష్ట ప్రాంతంలో నివసించే మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.దరఖాస్తు సమర్పించే ముందు మీ ప్రాంతానికి వర్తించే అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో జాగ్రత్తగా పరిశీలించండి.

ఎంపిక విధానం :

ఈ నియామకాల్లో మొత్తం 100 మార్కుల వెయిటేజ్ విధానాన్ని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో సాధించిన మార్కులకు 70 మార్కుల వెయిటేజ్ కేటాయించారు. మిగిలిన మార్కులు అర్హతలకు అనుగుణంగా కేటాయిస్తారు.

అంశం మార్కులు
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మార్కులు 70
వితంతు అభ్యర్థులకు 5
అనాథ అభ్యర్థులకు 10
అర్హత కలిగిన దివ్యాంగులకు 5
సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూ 10
మొత్తం 100

ఎలా దరఖాస్తు చేయాలి?

1. తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ https://wdcw.tg.nic.in ను సందర్శించండి.

2. వికారాబాద్ జిల్లా అంగన్వాడీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తెరవండి.

3. మీ అర్హతలు, స్థానికత, సంబంధిత పోస్టుల వివరాలను పరిశీలించండి.

4. ఆన్‌లైన్ దరఖాస్తులో అవసరమైన వివరాలను నమోదు చేయండి.

5. సూచించిన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సమర్పించండి.

6. దరఖాస్తు కాపీని భద్రపరచుకోండి.

7. నోటిఫికేషన్ ప్రకారం ధ్రువీకరణ పత్రాల అటెస్టెడ్ ప్రతులను సంబంధిత ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించండి.

ముఖ్యమైన దరఖాస్తు తేదీలు ; 

కార్యక్రమం తేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం 10 అక్టోబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 24 అక్టోబర్ 2026, సాయంత్రం 5 గంటలు
ధ్రువీకరణ పత్రాల ప్రతుల సమర్పణ 26 అక్టోబర్–1 నవంబర్ 2026

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అవసరమైన ధ్రువీకరణ పత్రాల అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి.

అవసరమైన ధ్రువీకరణ పత్రాలు :

దరఖాస్తు చేసుకునే మహిళలు కింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

వయస్సు లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం

కుల ధ్రువీకరణ పత్రం

ఇంటర్మీడియట్ మార్కుల జాబితా

నివాస ధ్రువీకరణ పత్రం

ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు

వర్తించే అభ్యర్థులకు దివ్యాంగత్వ ధ్రువీకరణ పత్రం

వితంతు అభ్యర్థులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం

అనాథ అభ్యర్థులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు

వర్తించే ఇతర రిజర్వేషన్ ధ్రువీకరణ పత్రాలు

Notification Pdf Click Here

Vacancy Detail Click Here 

Official Website Click Here

Apply Online Link Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *