Indian Air Force Recruitment 2026: 12వ తరగతి అర్హతతో IAFలో గ్రూప్-C ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.
Indian Air Force Recruitment 2026: 12వ తరగతి అర్హతతో IAFలో గ్రూప్-C ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి.
Indian Air Force Recruitment 2026:
భారత వైమానిక దళం (Indian Air Force – IAF)లో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. 12వ తరగతి అర్హతతో గ్రూప్-C సివిలియన్ విభాగంలో హిందీ టైపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకానికి సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 23 నవంబర్ 2026గా పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో ఉద్యోగాలు
ఉద్యోగ విభాగం : గ్రూప్-C సివిలియన్
పోస్టు పేరు : హిందీ టైపిస్ట్
విద్యార్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి.
1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
2. ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి.
వయోపరిమితి :
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 23 నవంబర్ 2026 నాటికి లెక్కించాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తించే అవకాశం ఉంది.
దరఖాస్తు రుసుము :
ఈ నియామకానికి దరఖాస్తు ఫీజు లేదు.
జీతం వివరాలు :
హిందీ టైపిస్ట్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 ప్రకారం నెలకు ₹19,900 నుంచి ₹63,200 వరకు వేతన స్కేల్ ఉంటుంది. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు వర్తించే నిబంధనల ప్రకారం అందుతాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికకు కింది దశలు ఉండవచ్చు:
1. రాత పరీక్ష
2. టైపింగ్ పరీక్ష
3. ధ్రువపత్రాల పరిశీలన చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు కింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ముందుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
2. నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనల ప్రకారం దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి.
3. అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, ఇతర పత్రాల ప్రతులను జత చేయాలి.
4. దరఖాస్తుపై అవసరమైన సంతకాలు చేసి, నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సిద్ధం చేయాలి.
5. పూర్తి చేసిన దరఖాస్తును చివరి తేదీలోపు సంబంధిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
The Commanding Officer,
Headquarters Southern Air Command (Unit),
Akkulam, Thiruvananthapuram – 695011.
ముఖ్యమైన తేదీ :
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23 నవంబర్ 2026
NotificationPdf : Click Here
Application Pdf : Click Here