Telangana Government Medical College Outsourcing Jobs 2026: డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
Telangana Government Medical College Outsourcing Jobs 2026: డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు…వెంటనే అప్లై చేసుకోండి.
Telangana Government Medical College Outsourcing Notification 2026:
తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల / ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, రికార్డ్ అసిస్టెంట్ / క్లర్క్, డిసెక్షన్ హాల్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 11 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు 2026 నవంబర్ 2 నుంచి నవంబర్ 5 వరకు జనగాం జిల్లా ఉపాధి కార్యాలయంలో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం, జనగాం లో ఉద్యోగాలు
ఉద్యోగాల పేరు : ప్రభుత్వ వైద్య కళాశాల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు
మొత్తం పోస్టులు : 11
ఉద్యోగ విధానం : అవుట్సోర్సింగ్
పోస్టుల పేర్లు : DEO, Receptionist cum Clerk, Record Assistant, Lab Attendant తదితరాలు
ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా కింది పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
1. డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator)
2. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ (Receptionist cum Clerk)
3. రికార్డ్ అసిస్టెంట్ / క్లర్క్ (Record Assistant / Clerk)
4. డిసెక్షన్ హాల్ అటెండెంట్ (Dissection Hall Attendant)
5. ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant)
6. ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate)
విద్యార్హతలు :
పోస్టును అనుసరించి అభ్యర్థులకు వేర్వేరు విద్యార్హతలు మరియు అనుభవం అవసరం.
1. డేటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) :
కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
లేదా ఏదైనా డిగ్రీతో పాటు PGDCA అర్హత కలిగి ఉండాలి.
2. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ (Receptionist cum Clerk) :
కంప్యూటర్ పరిజ్ఞానంతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
లేదా ఏదైనా డిగ్రీతో పాటు PGDCA అర్హత ఉండాలి.
3. రికార్డ్ అసిస్టెంట్ / క్లర్క్ (Record Assistant / Clerk) :
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
మెడికల్ రికార్డ్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఉండాలి.
DCA / PGDCA అర్హత అవసరం.
4. డిసెక్షన్ హాల్ అటెండెంట్ (Dissection Hall Attendant) :
SSC లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
రిజిస్టర్డ్ ఆసుపత్రి / కళాశాలలోని అనాటమీ విభాగం, మార్చురీ లేదా ఆపరేషన్ థియేటర్లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
5. ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant) :
SSC లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
మెడికల్ కాలేజీ లేదా రసాయన పరీక్షల విభాగంలోని ప్రయోగశాలలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
తెలుగు, ఇంగ్లీష్ భాషలను చదవడం మరియు రాయడం తెలిసి ఉండాలి.
6. ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) :
SSC లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి.
తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
వయస్సు పరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కింది విధంగా ఉండాలి.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు మధ్య ఉండాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹15,600 నుంచి ₹19,500 వరకు పారితోషికం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా రాత పరీక్ష మరియు / లేదా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ తేదీ: 07-11-2026
హాల్ టికెట్లు: 06-11-2026న జారీ చేయబడతాయి.
పరీక్ష వేదిక మరియు సమయం హాల్ టికెట్లో పేర్కొనబడతాయి.
ఎంపికకు సంబంధించిన వివరాలు జనగాం జిల్లా అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతారు.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించే సమయంలో కింది ధృవపత్రాల స్వీయ ధృవీకరించిన జిరాక్స్ కాపీలను జతచేయాలి.
1. SSC సర్టిఫికెట్
2. విద్యార్హత సర్టిఫికెట్లు.
3.మార్కుల మెమోలు
4. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసినట్లు ధృవీకరించే స్టడీ సర్టిఫికెట్లు / నివాస ధృవపత్రాలు.
5. కుల ధృవపత్రం
6. అనుభవ ధృవపత్రం (వర్తించే పోస్టులకు)
7. పాస్పోర్ట్ సైజు ఫోటో
8. నిర్దేశించిన దరఖాస్తు ఫారం
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
జిల్లా ఉపాధి కార్యాలయం,
గది నం. S-29,
జనగాం జిల్లా, తెలంగాణ.
దరఖాస్తులను 2026 నవంబర్ 2 నుంచి నవంబర్ 5 వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య వ్యక్తిగతంగా సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
| కార్యక్రమం | తేదీ |
|---|---|
| దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం | 02-11-2026 |
| దరఖాస్తుల చివరి తేదీ | 05-11-2026 |
| హాల్ టికెట్ల జారీ | 06-11-2026 |
| రాత పరీక్ష / ఎంపిక ప్రక్రియ | 07-11-2026 |
| పరీక్ష సమయం | ఉదయం 11:00 గంటలకు |
Notification Pdf : Click Here
ApplicationPdf : Click Here