BHEL Supervisor Trainee Recruitment 2026-27 : 215 సూపర్‌వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…Apply Now :
BHEL Supervisor Trainee Recruitment 2026-27 : 215 సూపర్‌వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల…Apply Now :
BHEL Supervisor Trainee Recruitment 2026-27:
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. BHEL సంస్థలో 215 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి Recruitment Notification 2026-27 విడుదలైంది. ఫైనాన్స్, హెచ్‌ఆర్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ అందించి, అనంతరం సూపర్‌వైజర్‌గా నియమించే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఉద్యోగాలు
నోటిఫికేషన్ : Supervisor Trainee Recruitment 2026-27
మొత్తం ఖాళీలు : 215
పోస్టుల పేరు : సూపర్‌వైజర్ ట్రైనీ
ఉద్యోగ విభాగాలు : Finance, HR, Engineering
ఖాళీల వివరాలు :
BHEL విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాల్లో సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Supervisor Trainee (Finance)
Supervisor Trainee (HR)
Supervisor Trainee (Mechanical)
Supervisor Trainee (Electrical)
Supervisor Trainee (Civil)
Supervisor Trainee (Electronics)
విద్యార్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
1. సూపర్‌వైజర్ ట్రైనీ (ఫైనాన్స్):
గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి కామర్స్ విభాగంలో పూర్తికాల రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
2. సూపర్‌వైజర్ ట్రైనీ (HR):
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కింది కోర్సుల్లో ఏదైనా ఒకటి పూర్తి చేసి ఉండాలి.
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
సోషల్ వర్క్
బిజినెస్ మేనేజ్‌మెంట్
BBS
BMS
3. సూపర్‌వైజర్ ట్రైనీ (ఇంజనీరింగ్ విభాగాలు):
మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి పూర్తికాల రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీ 01-11-2026 నాటికి వయస్సు అర్హతను పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితిలో సడలింపులు:
| కేటగిరీ | వయో సడలింపు |
|---|---|
| SC/ST | 5 సంవత్సరాలు |
| OBC (NCL) | 3 సంవత్సరాలు |
| PwBD – General | 10 సంవత్సరాలు |
| PwBD – OBC (NCL) | 13 సంవత్సరాలు |
| PwBD – SC/ST | 15 సంవత్సరాలు |

దరఖాస్తు ఫీజు :
| అభ్యర్థుల కేటగిరీ | దరఖాస్తు ఫీజు |
|---|---|
| General / EWS / OBC | రూ.1,072 |
| SC / ST / PwBD / Ex-Servicemen | రూ.472 |
దరఖాస్తు ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపు విధానాన్ని బట్టి అదనపు బ్యాంకు ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది.
జీతం వివరాలు :
BHEL సూపర్‌వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో సంస్థ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
శిక్షణ పూర్తయిన తర్వాత సూపర్‌వైజర్ పోస్టులో నియమితులైన వారికి కింది పే స్కేల్ వర్తిస్తుంది.
ప్రారంభ మూల వేతనం: రూ.33,500
పే స్కేల్: రూ.33,500 – రూ.1,20,000
ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు సంస్థ నిబంధనల ప్రకారం ఉంటాయి.
ఎంపిక విధానం :
BHEL సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) / రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా BHEL అధికారిక వెబ్‌సైట్ https://careers.bhel.in ఓపెన్ చేయాలి.
2. వెబ్‌సైట్‌లో Supervisor Trainee Recruitment 2026-27 నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.
3. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను పూర్తిగా చదవాలి.
4. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
5. అభ్యర్థి వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేయాలి.
6. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
7. కేటగిరీ ఆధారంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
8. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి, దాని ప్రింట్ లేదా కాపీని భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 25 నవంబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ : 28 డిసెంబర్ 2026
Notification Pdf : Click Here
Apply Online : Click Here