AP Jobs

AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 : ఇంటర్ అర్హతతో 1,156 పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

calendar_month November 28, 2026 person chitra

AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 : ఇంటర్ అర్హతతో 1,156 పోస్టులు.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!

AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2026 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇంటర్మీడియట్ అర్హతతో మొత్తం 1,156 పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (SLPRB AP) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్ కానిస్టేబుళ్లు, ఏఆర్ కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన మహిళలు, పురుషులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

AP Constable Jobs 2026 – పోస్టుల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,156 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.

ఉద్యోగాల పేరు ఖాళీలు
సివిల్ కానిస్టేబుళ్లు 542
ఏఆర్ కానిస్టేబుళ్లు 285
ఫైర్‌మెన్ 158
జైళ్ల శాఖ వార్డర్లు 171
మొత్తం 1,156

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 01 జూలై 2026 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సును 01 జూలై 2026 నాటికి పరిగణిస్తారు.

కనీస వయస్సు: 18 సంవత్సరాలు.

గరిష్ఠ వయస్సు: 32 సంవత్సరాలు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఓసీ (EWS సహా), బీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 37 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

దరఖాస్తు రుసుము :

అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా దరఖాస్తు రుసుము ఉంటుంది.

ఓసీ (EWS సహా), బీసీ అభ్యర్థులు: రూ.300/-

ఏపీ స్థానిక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు: రూ.150/-

ఏపీ స్థానికేతర అభ్యర్థులు: రూ.300/-

ఈ ఫీజు దరఖాస్తు ప్రాసెసింగ్, PMT/PET, రాత పరీక్ష తదితర ప్రక్రియలకు వర్తిస్తుంది.

జీతం వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సవరించిన పే స్కేల్ 2022 ప్రకారం నెలకు రూ.25,220 నుంచి రూ.80,910 వరకు వేతనం లభిస్తుంది. పోస్టు ఆధారంగా ఇతర అలవెన్సులు, ప్రభుత్వ ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో నిర్వహిస్తారు. ప్రధానంగా కింది పరీక్షలు, ప్రక్రియలు ఉంటాయి.

1. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలన.

2. ప్రాథమిక రాత పరీక్ష.

3. ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT).

4. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET).

5. తదుపరి రాత పరీక్షలు మరియు ధ్రువపత్రాల పరిశీలన.

పోస్టుల వారీగా ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

ప్రాథమిక రాత పరీక్ష తేదీ :

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్షను 2027 జనవరి 31వ తేదీన నిర్వహించనున్నారు.

పరీక్ష తేదీ: 31 జనవరి 2027

పరీక్ష నిర్వహణ సమయం: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

1. ముందుగా SLPRB AP అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ ఓపెన్ చేయాలి.

2. AP పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను ఎంచుకోవాలి.

3. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను పూర్తిగా చదవాలి.

4. ఆన్‌లైన్ దరఖాస్తులో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

5. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.

6. కేటగిరీ ఆధారంగా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

7. దరఖాస్తును సబ్మిట్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 27 నవంబర్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 16 డిసెంబర్ 2026

Press Note :  Click Here

Notification Pdf  : Click Here

Apply Online Link  : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *