telangana jobs

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-IV ఉద్యోగాల భర్తీ 2026 | 5వ, 7వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు…Apply Now:

calendar_month November 26, 2026 person chitra

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రూప్-IV ఉద్యోగాల భర్తీ 2026 | 5వ, 7వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు…Apply Now:

Telangana Collector Office Recruitment 2026 :

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిధిలో గ్రూప్-IV కేటగిరీకి చెందిన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామాటి, వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు 5వ తరగతి లేదా 7వ తరగతి విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీల కింద ఈ నియామకాలు చేపడుతున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 నవంబర్ 25 నుంచి డిసెంబర్ 11 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

నోటిఫికేషన్ పేరు : కలెక్టర్ కార్యాలయం గ్రూప్-IV నియామకాలు లో ఉద్యోగాలు

రాష్ట్రం: తెలంగాణ

జిల్లా : కామారెడ్డి

ఉద్యోగాల కేటగిరీ: గ్రూప్-IV

పోస్టుల పేర్లు : ఆఫీస్ సబార్డినేట్, కుక్, కామాటి, వాచ్‌మెన్

ఖాళీల వివరాలు : 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం వివిధ కేటగిరీల్లో మొత్తం 6 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగం పేరు ఖాళీలు
ఆఫీస్ సబార్డినేట్ 02
కుక్ 01
కామాటి 02
వాచ్‌మెన్ 01
మొత్తం 06

మొత్తం ఖాళీలు :06

దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు పోస్టును బట్టి 5వ తరగతి లేదా 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అభ్యర్థులకు తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

వయోపరిమితి :

01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు ఈ క్రింది విధంగా ఉండాలి.

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ఠ వయస్సు: 54 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనలు, సంబంధిత జీవోలు మరియు రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయోపరిమితిని నిర్ణయిస్తారు.

ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన నిర్వహించనున్నారు. ఎంపికలో కింది అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు.

ఎంపిక అంశం మార్కులు
సంబంధిత ఉద్యోగానికి నిర్ణయించిన విద్యార్హతలో సాధించిన మార్కులు 80
అంగవైకల్య శాతం 10
అభ్యర్థి వయస్సు 10
మొత్తం 100

అభ్యర్థుల విద్యార్హతలు, దివ్యాంగత్వ శాతం, వయస్సు ఆధారంగా మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసుకునే విధానం :

ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తును సీల్డ్ కవరులో ఉంచి, కవరు పైభాగంలో దరఖాస్తు చేసుకునే పోస్టు పేరును స్పష్టంగా రాయాలి.

దరఖాస్తులను కింది చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ,

రూమ్ నంబర్: 31,

కలెక్టర్ కార్యాలయం,

కామారెడ్డి జిల్లా, తెలంగాణ.

గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను స్వీకరించరు. కాబట్టి అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తులను పంపించాలి.

దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన ధ్రువపత్రాలు :

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కింది ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి జతపరచాలి.

1. విద్యార్హత ధ్రువపత్రాలు.

2. పదో తరగతి సర్టిఫికెట్ లేదా జనన తేదీ ధ్రువీకరణ పత్రం.

3. ఆధార్ కార్డు జిరాక్స్.

4. ఎంప్లాయ్‌మెంట్ కార్డు జిరాక్స్.

5. దివ్యాంగత్వానికి సంబంధించిన ధ్రువపత్రాలు.

6. నోటిఫికేషన్‌లో కోరిన ఇతర ధ్రువపత్రాలు.

అటెస్టేషన్ చేయని ధ్రువపత్రాల ప్రతులను స్వీకరించరు.

ఫోటోగ్రాఫ్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

1. ఇటీవల తీసుకున్న రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను జతపరచాలి.

2. ఒక ఫోటోను దరఖాస్తు ముందు భాగంలో అతికించాలి.

3. అతికించిన ఫోటోపై అభ్యర్థి సంతకం చేయాలి.

4. రెండో ఫోటోను దరఖాస్తుకు పిన్ చేయాలి.

5. దరఖాస్తులో అభ్యర్థి సెల్‌ఫోన్ నంబర్ తప్పనిసరిగా పేర్కొనాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 25 నవంబర్ 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 11 డిసెంబర్ 2026

Notification Pdf  : Click Here

Application Pdf  : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *