Education News

నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2027.. నవంబర్ 28న పరీక్ష.. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు!

calendar_month November 27, 2026 person chitra

నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2027.. నవంబర్ 28న పరీక్ష.. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు!

Jawahar Navodaya Vidyalaya Selection Test 2027:

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు సంబంధించి నవోదయ విద్యాలయ సమితి (NVS) కీలక సూచనలు జారీ చేసింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6వ తరగతి ప్రవేశ ఎంపిక పరీక్ష (JNVST) 2026 నవంబర్ 28వ తేదీన నిర్వహించనున్నారు.

ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను తెలుసుకోవాలి. పరీక్ష సమయం, రిపోర్టింగ్ సమయం, తీసుకెళ్లాల్సిన పత్రాలు, పరీక్షా హాలులో పాటించాల్సిన నిబంధనల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2027 – ముఖ్యమైన వివరాలు : 

వివరాలు సమాచారం
పరీక్ష పేరు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST)
విద్యా సంవత్సరం 2027
తరగతి 6వ తరగతి
పరీక్ష తేదీ 28 నవంబర్ 2026
పరీక్ష సమయం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
రిపోర్టింగ్ సమయం ఉదయం 10:30 గంటలకు
పరీక్ష వ్యవధి 2 గంటలు

పరీక్షకు వెళ్లే విద్యార్థులు తీసుకెళ్లాల్సినవి :

నవోదయ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు కింది వస్తువులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.

1. నవోదయ పరీక్ష అడ్మిట్ కార్డు.

2. నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్.

3. ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ నివాస ధృవీకరణ పత్రం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. అభ్యర్థి పుట్టిన తేదీని ధృవీకరించే సంబంధిత ఆధారం.

ముఖ్య గమనిక: అడ్మిట్ కార్డు, నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ మినహా ఇతర వస్తువులను పరీక్షా హాలులోకి తీసుకెళ్లకూడదు.

Click Here to Download Admit Cards for Class VI JNVST 2027

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *