IIT Jobs 2026 : జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు | IIT Bhilai Recruitment 2026 Apply Online :
IIT Jobs 2026 : జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ & జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు | IIT Bhilai Recruitment 2026 Apply Online
:
IIT Bhilai Non-Teaching Recruitment 2026:
ప్రతిష్టాత్మకమైన Indian Institute of Technology Bhilai సంస్థలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కౌన్సెలర్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు 06 మార్చి 2026 నుండి ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు 27 మార్చి 2026 సాయంత్రం 5:00 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు : IIT భిలాయ్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ సూపరింటెండెంట్ (JS)
2. జూనియర్ కౌన్సెలర్ (JC)
3. జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ (JSO)
4. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ (AFO)
5. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్
6. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (JTA) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 32
రిక్రూట్మెంట్ విధానం : రెగ్యులర్ బేసిస్
విద్య అర్హతలు:
జూనియర్ సూపరింటెండెంట్ (JS):
1. కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం లేదా
2. బ్యాచిలర్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
జూనియర్ కౌన్సెలర్ (JC):
1. క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (55% మార్కులు) + 3 సంవత్సరాల అనుభవం లేదా
2. సైకాలజీలో మాస్టర్స్ + మెంటల్/సోషల్ సైకాలజీలో డిప్లొమా + 3 సంవత్సరాల అనుభవం.
జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ (JSO):
1. M.P.Ed / Sports Science లో మాస్టర్స్ డిగ్రీ + 3 సంవత్సరాల అనుభవం లేదా
2. B.P.Ed / Sports Science లో బ్యాచిలర్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం.
అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ (AFO):
1. బ్యాచిలర్ డిగ్రీ (55% మార్కులు)
2. సాయుధ దళాలు / పోలీస్ / పారామిలిటరీ దళాలలో 5 సంవత్సరాల అనుభవం.
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (JTA):
1. M.Tech / M.E (Computer Science / IT) + 1 సంవత్సరం అనుభవం లేదా
2. B.Tech / BE / B.Sc Engineering + 3 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి:
1. కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
1. UR / OBC / EWS అభ్యర్థులకు : ₹500
2. SC / ST / PWD అభ్యర్థులకు : ₹250 ఫీజు చెల్లించాలి.
3. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేయాలంటే ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు చేయాలి.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹35,400 నుండి ₹1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4. అన్ని సమాచారాలు అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
Indian Institute of Technology Bhilai విడుదల చేసిన నాన్-టీచింగ్ రిక్రూట్మెంట్ 2026 పోస్టులకు అభ్యర్థులు క్రింది విధంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.iitbhilai.ac.in/ ను ఓపెన్ చేయాలి.
2. హోమ్‌పేజీలో ఉన్న Recruitment / Careers సెక్షన్‌లోకి వెళ్లాలి.
3. అక్కడ IIT Bhilai Non-Teaching Recruitment 2026 నోటిఫికేషన్‌ను క్లిక్ చేయాలి.
4. నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, మీకు అర్హత ఉన్న పోస్టును ఎంపిక చేసుకోవాలి.
5. Apply Online బటన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి.
6. అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అనుభవ వివరాలు సరైన విధంగా నమోదు చేయాలి.
7. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికెట్లు) అప్లోడ్ చేయాలి.
8. వర్తించే అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
9. అన్ని వివరాలు చెక్ చేసి Submit బటన్‌పై క్లిక్ చేయాలి.
10. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 06 మార్చ్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 27 మార్చ్ 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now