Private Jobs

రాత పరీక్ష లేకుండా DM&HOలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు | Aarogya Mithra Recruitment 2026 Apply Now :

calendar_month June 14, 2026 person chitra

రాత పరీక్ష లేకుండా DM&HOలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు | Aarogya Mithra Recruitment 2026 Apply Now :

Aarogya Mithra Recruitment 2026 :

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) కార్యాలయం ద్వారా అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆరోగ్య మిత్ర (Aarogya Mithra) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో క్షేత్రస్థాయి కార్యకలాపాల కోసం ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులతో పాటు, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ప్రాంతంలో ఉన్న TIMS ఆసుపత్రిలో కూడా ఆరోగ్య మిత్రలను నియమించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) కార్యాలయం లో ఆరోగ్య మిత్ర (Aarogya Mithra) ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : ఆరోగ్య మిత్ర (Aarogya Mithra) పోస్టులు

మొత్తం పోస్టులు : 26

విద్య అర్హతలు :

1. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. అదనంగా DCA (Diploma in Computer Applications) అర్హత తప్పనిసరి.

ఎంపిక విధానం :

1. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు.

2. అర్హతలు, అనుభవం మరియు నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం :

అర్హులైన అభ్యర్థులు మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్  https://medchal-malkajgiri.telangana.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేయాలి.

దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా :

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) కార్యాలయం,
F1, IDOC భవనం, అంతాయిపల్లి,
మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు :

1. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం

2. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు

3. ఇతర అవసరమైన ధృవపత్రాలు

4. రూ.500/- డిమాండ్ డ్రాఫ్ట్ (Demand Draft)

5. డిమాండ్ డ్రాఫ్ట్‌ను “District Medical & Health Officer, Medchal-Malkajgiri District” పేరిట తీసి దరఖాస్తుతో పాటు సమర్పించాలి.

సమర్పణ తేదీలు:

అభ్యర్థులు తమ దరఖాస్తులను 15 జూన్ 2026 నుండి 19 జూన్ 2026 వరకు ప్రతి రోజు ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు.

Notification Pdf :  Click Here

Application Pdf  :Click Here

Official Website  :Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *