యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏప్రిల్ 18న భారీ జాబ్‌మేళా.. 1500+ ఉద్యోగాలు సిద్ధం!
యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏప్రిల్ 18న భారీ జాబ్‌మేళా.. 1500+ ఉద్యోగాలు సిద్ధం!
అమలాపురం జాబ్ మేళా 2026 పూర్తి వివరాలు:
అమలాపురం జాబ్ మేళా 2026 యువతకు గొప్ప అవకాశంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అమలాపురం జాబ్ మేళా 2026లో 1500కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఈ మెగా జాబ్‌మేళా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం భూపయ్య అగ్రహారం రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ లో నిర్వహించబడుతుంది. మొత్తం 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 1500కు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి.
జాబ్ మేళా పాల్గొనే కంపెనీలు & ఉద్యోగ వివరాలు:
TATA Electronics – జూనియర్ టెక్నీషియన్ (135 పోస్టులు)
SIVANIK Tech – గ్రాఫిక్ డిజైనర్, BDE, టెలికాలర్ (110 పోస్టులు)
Apollo Tyres – టెక్నీషియన్ (60 పోస్టులు)
SSR LTL – ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ (100 పోస్టులు)
Swasthirya – BDE, కౌన్సిలర్ (130 పోస్టులు)
TVS – ఆపరేటర్ (130 పోస్టులు)
Sambara Celebrations – సేల్స్ మేనేజర్ (145 పోస్టులు)
TATA AIA – ఇన్సూరెన్స్ అడ్వైజర్ (50 పోస్టులు)
Foxconn – ఆపరేటర్ (60 పోస్టులు)
Avanthi Foods – వివిధ పోస్టులు (150+ పోస్టులు)
Deccan Fine Chemicals – కెమిస్ట్ ట్రెయినీ (50 పోస్టులు)
Brainthem – BDE, కౌన్సిలర్ (100 పోస్టులు)
Isuzu Motors – టెక్నీషియన్ (30 పోస్టులు)
iTech Software Solutions – టెక్ సపోర్ట్, డెవలపర్ (6 పోస్టులు)
S B Motors – ఫీల్డ్ సేల్స్ (80 పోస్టులు)
జీతం వివరాలు & విద్య అర్హతలు:
జీతం వివరాలు : రూ.10,000 నుంచి రూ.25,000 వరకు (కొన్ని కంపెనీలలో ఇంకా ఎక్కువ)
విద్య అర్హతలు: SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, B.Tech, MCA
వయస్సు : 18 నుంచి 40 సంవత్సరాల మధ్య (పోస్టు ఆధారంగా మారుతుంది)
పని ప్రదేశాలు: అమలాపురం, శ్రీ సిటీ, హోసూర్, బెంగళూరు, తుని, కోనసీమ.
జాబ్‌మేళా పూర్తి వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ: 18 ఏప్రిల్ 2026
సమయం: ఉదయం 10 గంటల నుండి
వేదిక: శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, అమలాపురం
సంప్రదించాల్సిన నంబర్స్ :
8247645389, 9988853335, 8712655686.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని కోల్పోకుండా తప్పక హాజరుకావాలి. ముందుగా రిజ్యూమ్, విద్యా సర్టిఫికెట్లు తీసుకెళ్లడం మంచిది.