AP Jobs

Anganwadi Jobs 2026: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో 171 అంగన్వాడి ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి:

calendar_month March 30, 2026 person chitra

Anganwadi Jobs 2026: రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో 171 అంగన్వాడి ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి:

Anganwadi Jobs 2026:

మహిళా అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ భారీగా అంగన్వాడి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 171 అంగన్వాడి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడి కార్యకర్త (AWW) మరియు అంగన్వాడి సహాయకురాలు (AWH) పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

కడప జిల్లాలోని వివిధ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 28, 2026 నుండి ఏప్రిల్ 13, 2026 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: జిల్లా మహిళా & శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. అంగన్వాడి కార్యకర్త (AWW) : 30 పోస్టులు

2. అంగన్వాడి సహాయకురాలు (AWH) : 141 పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టులు : 171

విద్య అర్హతలు :

1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. అభ్యర్థులు స్థానికంగా నివసించే వివాహిత మహిళలు కావాలి.

వయోపరిమితి:

01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

జీతం వివరాలు:

1. అంగన్వాడి కార్యకర్త (AWW) : రూ. 11,500/-

2. అంగన్వాడి సహాయకురాలు (AWH) : రూ. 7,000/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

1. విద్యార్హత మెరిట్

2. వయస్సు

3. రోస్టర్ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అర్హత కలిగిన అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను గజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ చేయించాలి.

2. ఆ తర్వాత సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో 13 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటల లోపు ఆఫ్‌లైన్ ద్వారా సమర్పించాలి.

3. దరఖాస్తు ఫారం మరియు పూర్తి నోటిఫికేషన్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: https://kadapa.ap.gov.in/

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 మార్చి 2026

దరఖాస్తు చివరి తేదీ : 13 ఏప్రిల్ 2026

ఇంటర్వ్యూ తేదీ : 23 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Application Pdf Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *