telangana jobs

అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు 2026: పరీక్ష లేకుండా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. వెంటనే దరఖాస్తు చేయండి..

calendar_month August 7, 2026 person chitra

అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు 2026: పరీక్ష లేకుండా మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. వెంటనే దరఖాస్తు చేయండి..

అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగాలు 2026:

మహిళలకు మరో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ (WDCW) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని పలు ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) మరియు అంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలో సాధించిన మెరిట్, ప్రత్యేక కేటగిరీ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేపడతారు. అర్హత కలిగిన మహిళలు తమ గ్రామం లేదా వార్డు పరిధిలోనే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ ప్రభుత్వం – మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ (WDCW) లో ఉద్యోగాలు

ప్రాజెక్టులు: చేర్యాల్, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట ICDS ప్రాజెక్టులు

పోస్టుల వివరాలు :

1. అంగన్వాడీ టీచర్ (Anganwadi Teacher)

2. అంగన్వాడీ హెల్పర్ (Anganwadi Helper)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మొత్తం ఖాళీలు : 91

ప్రాజెక్ట్ అంగన్‌వాడీ టీచర్ అంగన్‌వాడీ హెల్పర్
చేర్యాల 4 1
దౌల్తాబాద్ 6 1
గజ్వేల్ 36 1
హుస్నాబాద్ 19 10
సిద్దిపేట 13 0
మొత్తం 78 13

విద్యార్హతలు :

అంగన్వాడీ టీచర్ (AWT) :

ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.

అంగన్వాడీ హెల్పర్ (AWH) :

1. ప్రాధాన్యతగా ఇంటర్మీడియట్ / 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2. అలాంటి అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, SSC / 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

వయోపరిమితి :

01 జూలై 2026 నాటికి కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

స్థానికత నిబంధనలు :

1. దరఖాస్తుదారు సంబంధిత అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గ్రామపంచాయతీ లేదా పట్టణ ప్రాంతంలోని వార్డు/డివిజన్‌కు చెందిన స్థానిక నివాసి అయి ఉండాలి.

2. SC/ST రిజర్వేషన్ కింద ఉన్న పోస్టులకు సంబంధిత గ్రామం లేదా ఆవాసంలో నివసించే మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.

దరఖాస్తు రుసుము :

ఈ నియామకానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష లేకుండా క్రింది విధంగా ఎంపిక చేపడతారు.

2. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ – 70 మార్కులు

ప్రత్యేక కేటగిరీలకు అదనపు మార్కులు :

అనాథలు – 5 మార్కులు

అనాథాశ్రమం / నిరాశ్రయ మహిళలు – 10 మార్కులు

దివ్యాంగులు (PWD) – 5 మార్కులు

జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ – 10 మార్కులు

3. విద్యార్హత, ప్రత్యేక కేటగిరీ మార్కులు మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితాను సిద్ధం చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం :

అర్హులైన మహిళా అభ్యర్థులు మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ అధికారిక వెబ్‌సైట్ ( wdcw.tg.nic.in ) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు, స్థానికత నిబంధనలు మరియు అవసరమైన పత్రాలను పరిశీలించడం మంచిది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05 ఆగస్టు 2026

దరఖాస్తు చివరి తేదీ: 15 ఆగస్టు 2026

Notification Pdf Click Here

Roster Wise Vacancy Details Click Here

Apply Link Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *