telangana jobs

Anganwadi Jobs : అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. 55 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

calendar_month September 23, 2026 person chitra

Anganwadi Jobs : అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు.. 55 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

Anganwadi Teacher Recruitment 2026 Hanamkonda 55 Posts:

తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మంచి అవకాశం వచ్చింది. హనుమకొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ (12వ తరగతి) ఉత్తీర్ణత ఉన్న మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, హనుమకొండ, పరకాల ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను తెలంగాణ మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ wdcw.tg.nic.in ద్వారా సమర్పించాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : తెలంగాణ లో అంగన్వాడీ ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

హనుమకొండ జిల్లాలో మొత్తం 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.

భీమదేవరపల్లి ప్రాజెక్టు: 23 పోస్టులు

హనుమకొండ ప్రాజెక్టు: 19 పోస్టులు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పరకాల ప్రాజెక్టు: 13 పోస్టులు

మొత్తం పోస్టులు : 55

విద్య అర్హతలు :

అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టుల భర్తీలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు కేటాయించిన పోస్టులకు సంబంధిత గ్రామానికి చెందిన స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయోపరిమితి :

అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును నిర్ధారించేందుకు అవసరమైన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక 100 మార్కుల విధానంలో జరుగుతుంది. ఇందులో ఇంటర్‌లో సాధించిన మార్కుల మెరిట్‌కు 70 మార్కులు కేటాయిస్తారు. అదనంగా ప్రత్యేక కేటగిరీలకు మార్కులు అందిస్తారు.

ఇంటర్ మెరిట్‌కు – 70 మార్కులు
వితంతువులకు – 5 మార్కులు
అనాథలకు – 10 మార్కులు
దివ్యాంగులకు – 5 మార్కులు
జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు – 10 మార్కులు

అభ్యర్థుల మెరిట్, అదనపు అర్హత మార్కులు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

అవసరమైన ధ్రువపత్రాలు :

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం.

దివ్యాంగ అభ్యర్థులు సదరం సర్టిఫికెట్, వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, అనాథ అభ్యర్థులు సంబంధిత అనాథ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.

దివ్యాంగ అభ్యర్థులకు అర్హతలు :

వినికిడి పరికరాల సహాయంతో వినగలిగే వారు, ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వహించగలిగే అంధులు, అలాగే కాళ్లు లేదా చేతులకు సంబంధించిన అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రీస్కూల్ బోధన, అంగన్వాడీ విధులకు ఆటంకం లేని అభ్యర్థులు అర్హులుగా పరిగణించబడతారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ: 22 సెప్టెంబర్ 2026

దరఖాస్తు చివరి తేదీలు : 06 అక్టోబర్ 2026

Notification Pdf Click Here

Vacancy List Click Here

Apply Online Link Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *