ASHA Worker Jobs 2026: పరీక్ష , ఫీజు లేకుండా 10వ తరగతి అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాలు..
ASHA Worker Jobs 2026: పరీక్ష , ఫీజు లేకుండా 10వ తరగతి అర్హతతో ఆశా కార్యకర్త ఉద్యోగాలు..
AP Asha Worker Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్లో మహిళా అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. కాకినాడ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (UPHC) పరిధిలో ఆశా కార్యకర్త (ASHA Worker) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నియామకంలో మొత్తం 29 ఆశా కార్యకర్త పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా సంబంధిత ప్రాంతంలో నివసించే మహిళా అభ్యర్థులకు ఈ నియామకంలో అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫీజు కూడా లేదు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP లో ఆశా కార్యకర్త ఉద్యోగాలు
పోస్టు పేరు : ఆశా కార్యకర్త (ASHA Worker)
మొత్తం ఖాళీలు : 29 పోస్టులు
పని ప్రదేశం : PHCలు, UPHCలు
విద్యార్హతలు :
ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి.
1. తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
2. అభ్యర్థి సంబంధిత రూరల్ సచివాలయం పరిధిలో నివసిస్తూ ఉండాలి.
3. వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. అభ్యర్థి వివాహిత మహిళ అయి ఉండాలి.
5. తెలుగు భాషను బాగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
6. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన ఉండాలి.
7. ప్రజలకు విషయాలను సులభంగా వివరించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించే చొరవ, సానుకూల దృక్పథం ఉండాలి.
వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, భర్త నుంచి విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
వయోపరిమితి :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఎటువంటి ఫీజు లేదు
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,000 వరకు పారితోషికం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎంపిక విధానం :
ఈ ఆశా కార్యకర్త పోస్టులకు రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థుల అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితర అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
దరఖాస్తుతో పాటు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు :
అభ్యర్థులు దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జత చేయాలి.
నివాస ధ్రువీకరణ పత్రం
రేషన్ కార్డు / BPL కార్డు
ఓటర్ ఐడీ
ఆధార్ కార్డు
బ్యాంకు పాస్బుక్
10వ తరగతి సర్టిఫికెట్
అవసరమైన ఇతర విద్యార్హత ధ్రువపత్రాలు
వితంతువు / విడాకులు / భర్త నుంచి విడిపోయిన స్థితి ఉంటే సంబంధిత డిక్లరేషన్
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు ముందుగా అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి, అందులో పేర్కొన్న దరఖాస్తు విధానం ప్రకారం ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలి. అవసరమైన వివరాలను తప్పులు
లేకుండా నమోదు చేసి, అడిగిన ధ్రువపత్రాల కాపీలను జత చేసి నిర్ణీత గడువులో సంబంధిత కార్యాలయానికి సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05 అక్టోబర్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ: 10 అక్టోబర్ 2026
Important Links:
| Notification Pdf | Click Here |
| Application Pdf | Click Here |
| Official Website | Click Here |