AP District Court Jobs 2026: రాత పరీక్ష లేకుండానే 7వ, 10వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు….వెంటనే అప్లై చేసుకోండి.
AP District Court Jobs 2026: రాత పరీక్ష లేకుండానే 7వ, 10వ తరగతి అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు….వెంటనే అప్లై చేసుకోండి.
AP District Court Jobs 2026:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేకుండా మెరిట్, పని అనుభవం మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు 2026 జూన్ 24 సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP District Court లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. ఆఫీస్ సబార్డినేట్ – 03
2. వాచ్‌మన్ కం స్వీపర్ – 01
3. రికార్డ్ అసిస్టెంట్ – 02
4. టైపిస్ట్ కం అసిస్టెంట్ – 01 పోస్టులు
మొత్తం పోస్టులు : 07
విద్య అర్హతలు :
1. ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మన్ కం స్వీపర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
2. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
3. టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి :
1. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు APCOS నిబంధనల ప్రకారం నెలకు రూ.15,000 నుంచి రూ.18,000 వరకు వేతనం చెల్లించబడుతుంది.
ఎంపిక విధానం :
1. ఈ నియామక ప్రక్రియలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
2. అభ్యర్థుల ఎంపిక క్రింది అంశాల ఆధారంగా జరుగుతుంది.
3. విద్యార్హతల్లో సాధించిన మెరిట్
4. పని అనుభవం
5. రూల్ ఆఫ్ రిజర్వేషన్
6. అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ల పరిశీలన తేదీలను ప్రత్యేకంగా తెలియజేస్తారు.
దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు :
1. విద్యార్హత ధ్రువపత్రాలు
2. కుల ధ్రువీకరణ పత్రం
3. రేషన్ కార్డు
4. ఆధార్ కార్డు
5. పని అనుభవ ధ్రువపత్రం (ఉంటే)
6. ఇతర అవసరమైన పత్రాలు
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు నమూనాను పూర్తి చేసి అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను జత చేసి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయానికి రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించాలి. వ్యక్తిగతంగా లేదా నేరుగా సమర్పించే దరఖాస్తులను స్వీకరించరు. గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 24 జూన్ 2026
Office Subordinate Notification & Application Pdf Click Here
Record Assistant Notification & Application Pdf Click Here
Typist Cum Assistant Notification & Application Pdf Click Here
Official Website Click Here