AP EAPCET 2026 Results: కాసేపట్లో ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
AP EAPCET 2026 Results: కాసేపట్లో ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
AP EAPCET 2026 Results:
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET 2026) ఫలితాలు నేడు జూలై 1, 2026 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డ్ (Rank Card) ను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ గవర్నెన్స్ (ManaMitra) సేవ ద్వారా కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొదటగా షెడ్యూల్ ప్రకారం ఫలితాలు జూన్ 1న విడుదల కావాల్సి ఉండగా, 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ 25% వెయిటేజ్ మార్కుల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. ఈ ఏడాది మే 12 నుంచి మే 20, 2026 వరకు నిర్వహించిన AP EAPCET పరీక్షలకు సుమారు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
AP EAPCET 2026 Rank Card ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
1. ManaMitra WhatsApp ద్వారా :
అభ్యర్థులు 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ పంపి తమ AP EAPCET 2026 Rank Card పొందవచ్చు.
స్టెప్స్:
1. విద్యా సేవలు (Education Services) ఎంపిక చేయండి.
2. AP EAPCET 2026 Rank Card పై క్లిక్ చేయండి.
3. క్రింది వివరాల్లో ఏదైనా ఒకటి నమోదు చేయండి.
Registration Number
EAPCET Hall Ticket Number
Date of Birth
4. Get Key Details పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
2. అధికారిక వెబ్సైట్ ద్వారా
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో కూడా తమ ర్యాంక్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విధానం:
1. AP EAPCET అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
2. హోమ్‌పేజీలో కనిపించే AP EAPCET 2026 Rank Card లింక్‌పై క్లిక్ చేయండి.
3. Registration Number లేదా Hall Ticket Numberతో పాటు అవసరమైన వివరాలు నమోదు చేయండి.
4. Submit చేసిన తర్వాత మీ Rank Card స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
అభ్యర్థులకు ముఖ్య సూచన :
అభ్యర్థులు తమ AP EAPCET 2026 Rank Card ను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, అందులో ఉన్న పేరు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, మార్కులు మరియు ఇతర వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది.
అలాగే, AP EAPCET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు మరియు అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కూడా త్వరలో విడుదల కానుంది. వాటికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తాము.
AP EAPCET 2026 Results Official Website