Results

AP EAPCET Results 2026: ఎంసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు.. ఇలా చెక్ చేసుకోండి!

calendar_month June 20, 2026 person chitra

AP EAPCET Results 2026: ఎంసెట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు.. ఇలా చెక్ చేసుకోండి!

AP EAPCET Results 2026 Release Date:

AP EAPCET Results 2026 కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త… ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన AP EAPCET-2026 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ ఫలితాలను జూన్ నెలలోనే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల ప్రక్రియ కారణంగా కొంత ఆలస్యం జరిగింది.

ఇప్పటికే ఎంసెట్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. జూన్ 18న ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించిన అనంతరం, మరో రెండు నుంచి మూడు రోజుల్లోగా అంటే జూన్ 22లోపు AP EAPCET ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

కౌన్సెలింగ్ ప్రక్రియపై త్వరలో ప్రకటన:

ఫలితాల ప్రకటన అనంతరం ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు వంటి దశల వారీ ప్రక్రియను అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించనున్నారు. అభ్యర్థులు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం మంచిది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) ఆధ్వర్యంలో, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది దాదాపు 3.55 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యారు.

ఇంజనీరింగ్ విభాగంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ వర్తింపజేయాల్సి ఉండటంతో ఫలితాల విడుదలలో జాప్యం ఏర్పడింది. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రకటన పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు ఎంసెట్ ఫలితాల విడుదల ప్రక్రియ వేగవంతమైంది.

అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ వంటి వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP EAPCET 2026 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

1. అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in ను సందర్శించాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

2. AP EAPCET Results 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.

3. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి.

4. ‘Submit’ బటన్‌పై క్లిక్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

5. భవిష్యత్ కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం ఫలితాల ప్రింట్ అవుట్ తీసుకొని భద్రపరచుకోవాలి.

ఏపీ ఈఏపీసెట్-2026 ఫలితాలు జూన్ 22లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.

AP EAPCET Results 2026 Direct Link  

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *