Results

AP EAPCET Results 2026: విద్యార్థులకు అలర్ట్.. జూన్ 30న ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల!

calendar_month June 29, 2026 person chitra

AP EAPCET Results 2026: విద్యార్థులకు అలర్ట్.. జూన్ 30న ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల!

AP EAPCET Results 2026 Release Date & Direct Link:

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన AP EAPCET 2026 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 30, మంగళవారం విడుదల కానున్నాయి.

జూన్ 30న విడుదల కానున్న AP EAPCET 2026 ఫలితాలు :

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారికంగా ఎక్స్ (X) వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. అలాగే, ఈ విషయాన్ని ఈఏపీసెట్ చైర్మన్, జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్ కె. ప్రసాద్ కూడా వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాశారు?

ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు AP EAPCET 2026 పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

MPC స్ట్రీమ్: 2.58 లక్షల మంది
BiPC స్ట్రీమ్: 70,929 మంది

ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగనున్నాయి.

ఫలితాలు ఆలస్యానికి కారణం ఏమిటి?

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

షెడ్యూల్ ప్రకారం ఫలితాలు జూన్ 1న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఏపీ సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, అలాగే CBSE రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు వేచి చూశారు. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమైంది.

అధికారుల ఏర్పాట్లు పూర్తి :

ప్రస్తుతం CBSE రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో, జూన్ 30న AP EAPCET 2026 ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

AP EAPCET Results 2026 ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు ఫలితాలు విడుదలైన వెంటనే అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్ మరియు అవసరమైన వివరాలు నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

అధికారిక వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in/

ఫలితాలు విడుదలైన వెంటనే ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా అందుబాటులో ఉంటుంది.

AP EAPCET 2026 Release Direct Link

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *