7వ తరగతి పాస్‌తో ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం.. పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ | AP Group-IV Backlog Recruitment 2026 Apply Now :
7వ తరగతి పాస్‌తో ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం.. పశుసంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ | AP Group-IV Backlog Recruitment 2026 Apply Now :
AP Collector Office Group–IV Backlog Recruitment 2026 :
Andhra Pradesh Government ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ANM మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం పొందుతున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : AP పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. జూనియర్ అసిస్టెంట్
2. టైపిస్ట్
3. ల్యాబ్ టెక్నీషియన్
4. కంప్యూటర్ ఆపరేటర్
5. ANM
6. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు
మొత్తం ఖాళీలు : 38
విద్యార్హతలు :
జూనియర్ అసిస్టెంట్ :
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
టైపిస్ట్ :
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత టైపింగ్ అర్హత ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ :
SSC + MLT డిప్లొమా / ఇంటర్ తర్వాత LT కోర్సు / B.Sc లైఫ్ సైన్స్ / MLTలో PG డిప్లొమా వంటి అర్హతలు ఉండాలి.
కంప్యూటర్ ఆపరేటర్ :
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ANM :
ఇంటర్మీడియట్‌తో పాటు ANM ట్రైనింగ్ లేదా MPHW వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ :
7వ తరగతి ఉత్తీర్ణత.
వయో పరిమితి :
01 జూలై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
జీతం వివరాలు :
పోస్టును బట్టి నెలకు రూ.20,000 నుంచి రూ.60,000 వరకు జీతం అందించనున్నారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించరు. క్రింది ప్రమాణాల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.
వయస్సుకు – 20 మార్కులు
వికలత్వానికి – 20 మార్కులు
ఎంప్లాయ్మెంట్ సీనియారిటీకి – 10 మార్కులు
మొత్తం 50 మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మెరిట్‌లో ముందున్న అభ్యర్థులను అప్పిలేట్ మెడికల్ బోర్డు ద్వారా పరిశీలిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలను పూర్తిగా నింపి సమర్పించాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌తో పాటు క్రింది వివరాలు జతచేయాలి:
పూర్తి పేరు
తండ్రి పేరు
పూర్తి చిరునామా
దివ్యాంగత వివరాలు
పుట్టిన తేది
విద్యార్హతలు
ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ వివరాలు
మొబైల్ నంబర్
నేటివిటీ వివరాలు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
దరఖాస్తులను సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టరేట్ కాంప్లెక్స్, కర్నూలు కార్యాలయానికి పంపించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 06 మే 2026
దరఖాస్తుల చివరి తేదీ : 14 మే 2026
Notification PDF Click Here
Official Website Click Here
Application Pdf Click Here