AP హైకోర్టు పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
AP హైకోర్టు పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
AP High Court Exams Schedule 2026 Release :
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 నియామక పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, యూడీ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు మే 23 నుంచి మే 25, 2026 వరకు జరగనున్నాయి.
AP హైకోర్టు పరీక్షల షెడ్యూల్ 2026 :
23-05-2026 పరీక్షలు :
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు మూడు షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
షిఫ్ట్-1: ఉదయం 09:00 గంటల నుంచి 10:30 గంటల వరకు
షిఫ్ట్-2: మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 02:00 గంటల వరకు
షిఫ్ట్-3: సాయంత్రం 04:00 గంటల నుంచి 05:30 గంటల వరకు
24-05-2026 నుండి 25-05-2026 వరకు పరీక్షలు:
లైబ్రేరియన్ గ్రేడ్-II, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్/ఎగ్జామినర్, టైపిస్ట్/కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ పోస్టులకు రెండు షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
షిఫ్ట్-1: ఉదయం 09:00 గంటల నుంచి 10:30 గంటల వరకు
షిఫ్ట్-2: మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 02:00 గంటల వరకు
సెక్షన్ ఆఫీసర్ & ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష :
సెక్షన్ ఆఫీసర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 24-05-2026 తేదీన షిఫ్ట్-3లో పరీక్ష జరుగుతుంది.
షిఫ్ట్-3: సాయంత్రం 04:00 గంటల నుంచి 05:30 గంటల వరకు
అభ్యర్థులకు ముఖ్య సూచన :
నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు, తదుపరి ప్రకటనలు వంటి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడుతుంది.
అధికారిక వెబ్సైట్: AP High Court Official Website
AP High Court Exams Schedule 2026 Click Here
AP High Court Official Website Click Here