AP Jobs

AP Mission Vatsalya Scheme 2026: విద్యార్థులకు శుభవార్త.. అర్హులైన పిల్లలకు నెలకు ₹4,000 ఆర్థిక సహాయం – వెంటనే దరఖాస్తు చేసుకోండి!

calendar_month June 28, 2026 person chitra

AP Mission Vatsalya Scheme 2026: విద్యార్థులకు శుభవార్త.. అర్హులైన పిల్లలకు నెలకు ₹4,000 ఆర్థిక సహాయం – వెంటనే దరఖాస్తు చేసుకోండి!

AP Mission Vatsalya Scheme 2026 Apply Online:

ఆంధ్రప్రదేశ్‌లోని అనాధలు, ఒంటరి తల్లిదండ్రులతో ఉన్న పిల్లలు, విడాకులు పొందిన తల్లిదండ్రుల పిల్లలు, యాసిడ్ దాడి బాధితులు మరియు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మిషన్ వాత్సల్య పథకం 2026 ద్వారా అర్హులైన ప్రతి చిన్నారికి నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

AP Mission Vatsalya Scheme 2026 అంటే ఏమిటి?

పిల్లల విద్య, పోషణ మరియు భవిష్యత్తు భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మిషన్ వాత్సల్య పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన, ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలకు ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఎవరెవరు అర్హులు?

ఈ పథకానికి క్రింది వర్గాల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.

1. అనాథ పిల్లలు.

2. తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరిని కోల్పోయిన పిల్లలు.

3. విడాకులు పొందిన తల్లిదండ్రుల పిల్లలు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

4. యాసిడ్ దాడి బాధితుల పిల్లలు.

5. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు.

వయోపరిమితి :

31 మార్చి 2026 నాటికి 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

ఆర్థిక సహాయం ఎంత?

1. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు నెలకు రూ.4,000 చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేస్తారు.

2. ప్రతి 6 నెలలకు ఒకసారి రూ.24,000 నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

3. సంవత్సరానికి మొత్తం రూ.48,000 వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది.

నిధుల భాగస్వామ్యం:

మిషన్ వాత్సల్య పథకానికి నిధులు ఈ విధంగా సమకూరుస్తారు.

కేంద్ర ప్రభుత్వం – 60%
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – 40%

దరఖాస్తు విధానం :

అర్హులైన పిల్లల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమకు సమీపంలోని ICDS ప్రాజెక్ట్ కార్యాలయం లేదా CDPO (Child Development Project Officer) కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు సమర్పించాలి. అలాగే స్థానిక అంగన్‌వాడీ కేంద్రం ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ముఖ్య సూచన :

అర్హత ఉన్న పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని సంబంధిత ICDS/CDPO కార్యాలయంలో దరఖాస్తు సమర్పిస్తే పథకం ప్రయోజనాలను పొందవచ్చు.

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *