AP Jobs

AP పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. 7th, 10th, ఇంటర్ అర్హతతో అవకాశం..! AP Police Department Recruitment 2026 Apply Now :

calendar_month August 28, 2026 person chitra

AP పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. 7th, 10th, ఇంటర్ అర్హతతో అవకాశం..! AP Police Department Recruitment 2026 Apply Now :

AP Police Department Recruitment 2026 :

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. AP పోలీస్ శాఖలో 36 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను ఔట్‌సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్వీపర్, స్కావెంజర్, వంటవారు, ధోబీ, బార్బర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రాజమహేంద్రవరంలోని 4వ IR బెటాలియన్, APSPలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పోస్టును బట్టి 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత వృత్తిలో అనుభవం ఉన్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

ఈ నియామకంలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా:

1. రికార్డ్ అసిస్టెంట్

2. ఆఫీస్ సబార్డినేట్

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. స్వీపర్లు

4. స్కావెంజర్లు

5. వంటవారు

6. ధోబీలు

7. బార్బర్లు పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 36 పోస్టులు

విద్య అర్హతలు :

1. పోస్టును బట్టి కనీస విద్యార్హత 7వ తరగతి, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌గా నిర్ణయించారు.

2. సంబంధిత పనిలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయోపరిమితి :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉండకూడదు. గరిష్ట వయస్సు 42 సంవత్సరాలుగా నిర్ణయించారు.

01-07-2026 నాటికి వయస్సును లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అయితే సడలింపుతో గరిష్ట వయస్సు 47 సంవత్సరాలకు మించకూడదు.

జీతం వివరాలు :

1. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.

2. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నెలకు సుమారు రూ.15,000 వరకు జీతం అందే అవకాశం ఉంది.

ఎంపిక విధానం :

ఈ నియామకానికి ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహించకుండా, నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం మరియు ఇతర అర్హతలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.

కాబట్టి తక్కువ విద్యార్హతతో ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. ముందుగా తూర్పు గోదావరి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ ( https://eastgodavari.ap.gov.in/ ) ను సందర్శించాలి.

2. సంబంధిత AP పోలీస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్/దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.

4. అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను దరఖాస్తుకు జత చేయాలి.

5. ఆధార్ నంబర్, పనిచేస్తున్న మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి.

6. పూర్తి చేసిన దరఖాస్తును నిర్దేశించిన విధంగా సమర్పించాలి.

7. దరఖాస్తు చివరి తేదీ, సమయానికి తప్పకుండా చేరేలా చూసుకోవాలి.

దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి?

అభ్యర్థి స్వయంగా పూరించిన దరఖాస్తును అన్ని అనుబంధ పత్రాలతో కలిసి నేరుగా లేదా పోస్టు ద్వారా క్రింది చిరునామాకు పంపించాలి:

కమాండెంట్,
4వ IR బెటాలియన్, APSP,
లాలాచెరువు, రాజమహేంద్రవరం,
తూర్పు గోదావరి జిల్లా – 533106.

దరఖాస్తు గడువు ముగిసేలోపు సంబంధిత కార్యాలయానికి చేరేలా అభ్యర్థులు జాగ్రత్త తీసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 ఆగష్టు 2026

దరఖాస్తులకు చివరి తేదీ: 05 సెప్టెంబర్ 2026

Notification Click Here

Application Form Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *