BSNL JTO Recruitment 2026: 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.
BSNL JTO Recruitment 2026: 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల… వెంటనే అప్లై చేసుకోండి.
BSNL JTO Recruitment 2026:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగ ఇంజినీరింగ్ అభ్యర్థులకు శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం.
టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఐటీ తదితర విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతభత్యాలు, శిక్షణతో పాటు భవిష్యత్తులో పదోన్నతి అవకాశాలు కూడా లభించనున్నాయి.
మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
BSNL JTO Recruitment 2026 – ముఖ్య వివరాలు :
సంస్థ పేరు : BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : Junior Telecom Officer (JTO) పోస్టులు
మొత్తం ఖాళీలు : 100
ఉద్యోగ స్థలం : భారతదేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
విద్య అర్హతలు :
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి క్రింది విభాగాల్లో ఏదైనా ఒకటిలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
1. దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. UR / EWS – 30 సంవత్సరాలు
3. OBC – 33 సంవత్సరాలు
4. SC / ST – 35 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. UR / OBC / EWS అభ్యర్థులకు ₹1000
2. SC / ST / PwBD అభ్యర్థులకు ₹500 ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు BSNL పే స్కేల్ ప్రకారం నెలకు ₹16,400 నుండి ₹40,500 వరకు జీతం అందించబడుతుంది.
2. అదనంగా DA, HRA మరియు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
JTO (Telecom) : ₹16,400 – ₹40,500
ఎంపిక విధానం :
1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. మెడికల్ ఎగ్జామినేషన్
4. ఫైనల్ మెరిట్ లిస్ట్
శిక్షణ కాలం :
ఎంపికైన అభ్యర్థులకు BSNL ప్రత్యేక శిక్షణ అందిస్తుంది.
Phase-I Training – 10 వారాలు
Field Training – 4 వారాలు
Phase-II Training – 6 వారాలు
అవసరమైన డాక్యుమెంట్లు :
1. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
2. సంతకం
3. 10వ తరగతి సర్టిఫికేట్
4. డిగ్రీ మార్కుల మెమోలు
5. కుల ధృవీకరణ పత్రం
6. EWS సర్టిఫికేట్ (అవసరమైతే)
7. PwBD సర్టిఫికేట్
8. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు BSNL అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. BSNL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
3. JTO Recruitment 2026 నోటిఫికేషన్ లింక్‌ను ఓపెన్ చేయండి.
4. కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
5. వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాలు నమోదు చేయండి.
6. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి.
7. దరఖాస్తు ఫీజు చెల్లించండి.
8. ఫారమ్‌ను సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 04 జూన్ 2026
దరఖాస్తుల చివరి తేదీ : 03 జూలై 2026