చాగల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెప్టెంబర్ 15న జాబ్ మేళా.. 520 ఉద్యోగాలు.. రూ.27,000 వరకు జీతం…మిస్ అవ్వొద్దు.
చాగల్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెప్టెంబర్ 15న జాబ్ మేళా.. 520 ఉద్యోగాలు.. రూ.27,000 వరకు జీతం…మిస్ అవ్వొద్దు.
చాగల్లులో భారీ జాబ్ మేళా 2026 :
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. SVRK ప్రభుత్వ జూనియర్ కాలేజీ వేదికగా 2026 సెప్టెంబర్ 15న జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో 11 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. మొత్తం 520 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Sc, M.Sc వంటి వివిధ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరై తమ అర్హతకు అనుగుణమైన ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని బట్టి ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.27,000 వరకు జీతం లభించనుంది.
జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు, ఉద్యోగాల వివరాలు :
| కంపెనీ | పోస్టు | ఖాళీలు | అర్హత | వయసు | జీతం |
|---|---|---|---|---|---|
| Flipkart | Picking & Packing | 50 | SSC & ఆపై | 19–35 | ₹16,000 |
| Foxconn | Assembler | 100 | SSC & ఆపై | 19–30 | ₹16,000 |
| KIA Motors | Operators | 30 | SSC/ITI/Inter/Diploma/Degree | 19–30 | ₹16,000 |
| NIIT ICICI Bank | Banking Operation | 20 | ఏదైనా డిగ్రీ | 20–25 | ₹23,000–₹26,000 |
| Paytm | Field Sales Executive | 50 | SSC | 19–35 | ₹15,000 |
| Rajendra Energy Power Solutions | Smart Meter Tech/Engineer | 100 | SSC/ITI/Diploma | 19–34 | ₹16,428 |
| SBI Payments | FRE | 20 | SSC & ఆపై | 20–45 | ₹15,000 |
| SBOSS Collection | Agri Loan Recovery | 30 | ఏదైనా డిగ్రీ | 19–35 | ₹10,000–₹27,000 |
| Skilza Global Pharmacy | Pharma Trainee/Production | 10 | B.Sc/M.Sc | 21–26 | ₹23,000 |
| Tata Electronics | Junior Technician | 100 | SSC/ITI/Inter/Diploma | 18–26 | ₹19,175 |
| UNO Minda | Operators | 10 | SSC/ITI/Inter/Diploma/Degree | 19–30 | ₹16,428 |
జాబ్ మేళా ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు :
జాబ్ మేళా తేదీ: 15 సెప్టెంబర్ 2026
వేదిక: SVRK ప్రభుత్వ జూనియర్ కాలేజీ, చాగల్లు
ప్రాంతం: కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా
పాల్గొనే కంపెనీలు: 11
మొత్తం ఉద్యోగాలు: 520
జీతం: రూ.10,000 నుంచి రూ.27,000 వరకు
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 7396740041
ముఖ్య సూచన :
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి నుంచి డిగ్రీ, PG వరకు విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఈ జాబ్ మేళా మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీన SVRK ప్రభుత్వ జూనియర్ కాలేజీ, చాగల్లు వద్ద జాబ్ మేళాకు హాజరై కంపెనీల ప్రతినిధులను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కోసం 7396740041 నంబర్‌కు సంప్రదించండి.