భారత ప్రభుత్వ బొగ్గు శాఖలో భారీ ఉద్యోగాలు.. కోల్ ఇండియాలో 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు | Coal India MT Notification 2026 :
భారత ప్రభుత్వ బొగ్గు శాఖలో భారీ ఉద్యోగాలు.. కోల్ ఇండియాలో 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు | Coal India MT Notification 2026 :
Coal India MT Notification 2026 :
భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ సంస్థ Coal India Limited తాజాగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ (Management Trainee) పోస్టులను E-1 గ్రేడ్‌లో భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, కంపెనీ సెక్రటరీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 12 మే 2026 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు 11 జూన్ 2026 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹60,000 ప్రారంభ బేసిక్ పే తో పాటు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రైనీ (E-1 Grade) పోస్టులు
మొత్తం ఖాళీలు : 660
ఉద్యోగ విధానం : పర్మనెంట్
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
ఉద్యోగ స్థలం : భారతదేశ వ్యాప్తంగా
విద్య అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో BE / B.Tech / B.Sc (Engineering) పూర్తి చేసి ఉండాలి.
అదనంగా కింది అర్హతలు కూడా వర్తిస్తాయి:
1. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ
2. కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా MCA
3. జియాలజీ / అప్లైడ్ జియాలజీ / జియోఫిజిక్స్‌లో MSc లేదా M.Tech
4. కంపెనీ సెక్రటరీ పోస్టులకు ICSI సభ్యత్వం అవసరం.
వయోపరిమితి :
30 ఏప్రిల్ 2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.
రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపులు:
1. OBCఅభ్యర్థులకు : 3 సంవత్సరాలు
2. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
3. PwBD అభ్యర్థులకు ప్రత్యేక సడలింపు
4. మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోరాయితీ ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. General / OBC / EWS అభ్యర్థులు : ₹1180
2. SC / ST / PwBD అభ్యర్థులకు ఫీజు లేదు.
3. ఫీజును కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
జీతం వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులను E-1 గ్రేడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా నియమిస్తారు.
2. ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹60,000 to ₹1,80,000 వరకు నెలకి జీతం ఇస్తారు.
3. DA, HRA, PRP మరియు ఇతర అలవెన్సులు
4. మెడికల్ సౌకర్యాలు, CMPF, గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
1. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది.
2. ఈ నోటిఫికేషన్‌లో ఇంటర్వ్యూ ఉండదు.
3. CBTలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అభ్యర్థులు Coal India Official Website లోని “Career with CIL” సెక్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2. అప్లికేషన్ ఫారమ్ నింపే ముందు అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితి, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
3. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 12 మే 2026
దరఖాస్తు చివరి తేదీ : 11 జూన్ 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Official Website Click Here