CPRI Recruitment 2026: విద్యుత్ శాఖలో 110 ఉద్యోగాలు.. Assistant, MTS పోస్టులకు నోటిఫికేషన్.. 10th, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలు..!
CPRI Recruitment 2026: విద్యుత్ శాఖలో 110 ఉద్యోగాలు.. Assistant, MTS పోస్టులకు నోటిఫికేషన్.. 10th, ITI, డిప్లొమా, డిగ్రీ అర్హతలు..!
CPRI Recruitment 2026:
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అటెండెంట్, అసిస్టెంట్ గ్రేడ్-II, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం 110 ఖాళీలకు అర్హులైన భారతీయ పౌరుల నుంచి CPRI ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. పోస్టును బట్టి 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్/డిప్లొమా, డిగ్రీ, B.E./B.Tech విద్యార్హతలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు 19 సెప్టెంబర్ 2026 ఉదయం 10 గంటల నుంచి 12 అక్టోబర్ 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
Engineering Officer Grade-I (Electrical/Civil) – 07
Engineering Assistant (Mechanical) – 12
Scientific Assistant – 02
Technician Grade-I (Electrical) – 07
Technician Grade-I (Mechanical) – 02
Technical Attendant Grade-I – 37
Assistant Grade-II – 29
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) గ్రేడ్-I – 14 ఖాళీలు (వాచ్ & వార్డ్ డ్యూటీలు)
మొత్తం ఖాళీలు: 110

విద్యార్హతలు :
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. ముఖ్యమైన అర్హతలు ఇవి:
Engineering Officer Grade-I – Electrical :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ B.E./B.Tech డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే 2024, 2025 లేదా 2026 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ ఉండాలి.
Engineering Officer Grade-I – Civil :
Civil Engineeringలో First Class B.E./B.Tech డిగ్రీతో పాటు 2024, 2025 లేదా 2026 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే GATE స్కోర్ ఉండాలి.
Scientific Assistant :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Chemistryలో First Class B.Sc. డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో 5 సంవత్సరాల అనుభవం అవసరం.
Engineering Assistant – Mechanical :
Mechanical Engineering/Technologyలో First Class 3 సంవత్సరాల డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
Technician Grade-I – Electrical :
Electrical ట్రేడ్‌లో ITI Trade Certificate కలిగి ఉండాలి.
Technician Grade-I – Mechanical :
Mechanical ట్రేడ్‌లో ITI Trade Certificate ఉండాలి.
Technical Attendant Grade-I :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. Electrical/Mechanical విభాగాల్లో 2 సంవత్సరాల ITI ట్రేడ్ సర్టిఫికెట్ ఉంటే ప్రాధాన్యత ఉంటుంది.
Assistant Grade-II :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి First Class BA/B.Sc./B.Com/BBA/BBM/BCA లేదా సంబంధిత డిగ్రీతో పాటు NIELIT నిర్వహించే ” Basic Computer Course (BCC) ” లో కనీసం Grade-B సర్టిఫికెట్ ఉండాలి. ఈ పోస్టుకు NIELIT నిర్వహించే BCC సర్టిఫికెట్ మాత్రమే ఆమోదించబడుతుంది.
MTS Grade-I – Watch & Ward Duties :
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ఈ పోస్టులు మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి.

వయోపరిమితి :
పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితి 28, 30 మరియు 35 సంవత్సరాలుగా ఉంటుంది. వయోపరిమితి, రిజర్వేషన్ సడలింపులు పోస్టు వారీగా అధికారిక నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము :
Engineering Officer Grade-I, Scientific Assistant, Engineering Assistant: ₹1,000/-
Technician Grade-I, Assistant Grade-II, Technical Attendant Grade-I: ₹700 /-
SC/ST/PwBD/Ex-Servicemen/Women: దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు
ఆన్లైన్ పేమెంట్‌కు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటే వాటిని అభ్యర్థులే భరించాలి.

జీతం వివరాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు కింది పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది:
Engineering Officer Grade-I: ₹44,900 – ₹1,42,400
Engineering Assistant: ₹35,400 – ₹1,12,400
Scientific Assistant: ₹35,400 – ₹1,12,400
Technician Grade-I: ₹19,900 – ₹63,200
Assistant Grade-II: ₹25,500 – ₹81,100
Technical Attendant Grade-I: ₹18,000 – ₹56,900
MTS Grade-I: ₹18,000 – ₹56,900
ఎంపిక విధానం :
పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపిక Computer Based MCQ Test, Trade Test లేదా Skill Test ద్వారా జరుగుతుంది. పరీక్షలు, స్కిల్/ట్రేడ్ టెస్ట్ తేదీలకు సంబంధించిన వివరాలను CPRI అధికారిక వెబ్‌సైట్‌లోని Career/Recruitment విభాగంలో ప్రకటిస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు CPRI అధికారిక వెబ్సైట్ ( https://cpri.res.in/ ) లోని Career/Recruitment విభాగానికి వెళ్లి ఆన్లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. దరఖాస్తు చేసే ముందు పోస్టు వారీగా విద్యార్హత, వయోపరిమితి, అనుభవం, ఫీజు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
పరీక్షా కేంద్రాలు :
CPRI రిక్రూట్మెంట్ పరీక్షలకు బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థి కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని కేటాయించేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 సెప్టెంబర్ 2026
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 12 అక్టోబర్ 2026
Notification Pdf : Click Here
Apply Online Link : Click Here
Official Website : Click Here