CSIR IGIB రిక్రూట్‌మెంట్ 2026: నెలకు రూ.39,970 ప్రారంభ వేతనంతో టెక్నీషియన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
CSIR IGIB రిక్రూట్‌మెంట్ 2026: నెలకు రూ.39,970 ప్రారంభ వేతనంతో టెక్నీషియన్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!
CSIR IGIB రిక్రూట్‌మెంట్ 2026:
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) సంస్థలో టెక్నీషియన్-1 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు సుమారు రూ.39,970 వరకు వేతనం అందించనున్నారు.
అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05 జూన్ 2026 ఉదయం 10 గంటల నుంచి 04 జూలై 2026 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : టెక్నీషియన్-1 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
UR – 07
EWS – 01
OBC (NCL) – 04
SC – 02
ST – 01
మొత్తం పోస్టులు : 15
విద్య అర్హతలు :
1. అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టుతో 10వ తరగతి/SSCలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
2. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ లేదా జాతీయ/రాష్ట్ర సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
3. లేదా గుర్తింపు పొందిన సంస్థలో సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణతో పాటు కనీసం రెండేళ్ల పూర్తి కాల అనుభవం కలిగి ఉండాలి.
4. లేదా సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి :
వయస్సు గణన తేదీ : 04 జూలై 2026 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులు : రూ.500/- ఫీజు చెల్లించాలి.
2. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు మరియు మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు.
3. ఫీజును SBI Collect ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
జీతం వివరాలు :
1. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 (రూ.19,900 – రూ.63,200) ప్రకారం వేతనం లభిస్తుంది.
2. అలవెన్సులతో కలిపి ప్రారంభ వేతనం సుమారు రూ.39,970 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం :
అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేస్తారు.
1. OMR లేదా కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష
2. మొత్తం ప్రశ్నలు : 150
3. పరీక్ష వ్యవధి : 2 గంటల 30 నిమిషాలు
4. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు CSIR-IGIB అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Technician (1)” లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలి.
2. అధికారిక వెబ్‌సైట్ : https://www.igib.res.in
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభ తేదీ : 05 జూన్ 2026
దరఖాస్తులకు చివరి తేదీ : 04 జూలై 2026
Notification Pdf Click Here
Official Website Click Here
Online Apply Link Click Here