10వ అర్హతతో CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026 – ఇప్పుడే అప్లై చేయండి !
10వ అర్హతతో CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026 – ఇప్పుడే అప్లై చేయండి !
CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026:
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. CSIR-నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 05 మే 2026 ఉదయం 8:30 గంటలకు ప్రారంభమై 04 జూన్ 2026 సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : CSIR-నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :10
రిక్రూట్మెంట్ విధానం : పర్మనెంట్ జాబ్స్
విద్యా అర్హతలు :
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) :
మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి)
డ్రైవర్ :
1. 10వ తరగతి పాస్
2. LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
3. కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.
4. వాహనాల ప్రాథమిక మరమ్మతులపై అవగాహన ఉండాలి.
వయోపరిమితి :
1. MTS: గరిష్టం 25 సంవత్సరాలు
2. డ్రైవర్: గరిష్టం 27 సంవత్సరాలు ఉండాలి.
వయస్సు సడలింపులు :
1. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
2. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు
3. OBC అభ్యర్థులకు : 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / OBC / EWS: ₹500/-
2. SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు.
జీతం వివరాలు:
1. MTS జీతం: ₹33,375/- (ప్రారంభం)
2. డ్రైవర్ జీతం: ₹36,700/- (ప్రారంభం) జీతం ఉంటుంది.
3. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. ట్రేడ్ / స్కిల్ టెస్ట్
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి
2. అధికారిక వెబ్సైటు : https://www.neist.res.in
3. అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం తప్పనిసరి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05 మే 2026
అప్లికేషన్ చివరి తేదీ: 04 జూన్ 2026
Notification Pdf Click Here
Apply Link Click Here
Office Website Click Here