ఉచిత కుట్టు మిషన్ పథకం 2026 – తెలంగాణ మైనారిటీ మహిళలకు దరఖాస్తుల ఆహ్వానం!
ఉచిత కుట్టు మిషన్ పథకం 2026 – తెలంగాణ మైనారిటీ మహిళలకు దరఖాస్తుల ఆహ్వానం!
TGCMFC Free Sewing Machine Scheme 2026:
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో అర్హులైన మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందించనుంది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యం. అర్హత కలిగిన మహిళలు 2026 జూలై 30 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
ఉచిత కుట్టు మిషన్ పథకం 2026 అర్హతలు :
ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రింది మైనారిటీ వర్గాల మహిళలు అర్హులు.
ముస్లిం
సిక్కు
బౌద్ధ
జైన
పార్సీ
అలాగే క్రింది వర్గాలకు చెందిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
నిరుద్యోగ మహిళలు
విడాకులు పొందిన మహిళలు
వితంతువులు
అనాథలు
నిరుపేద మహిళలు
ఒంటరి మహిళలు
అర్హతలు :
1. అభ్యర్థి వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
3. ప్రభుత్వం లేదా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ నుంచి టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ ఉండాలి.
4. ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే మంజూరు చేస్తారు.
అవసరమైన పత్రాలు :
దరఖాస్తుతో పాటు ఈ క్రింది పత్రాలను సమర్పించాలి.
ఆధార్ కార్డు
ఓటరు గుర్తింపు కార్డు
తెల్ల రేషన్ కార్డు
ఆదాయ ధ్రువీకరణ పత్రం
వయస్సు నిర్ధారించే ధ్రువీకరణ పత్రం
ప్రభుత్వ గుర్తింపు పొందిన టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్
అనాథ అయితే అనాథ ధ్రువీకరణ పత్రం
వితంతువు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు (వర్తించినట్లయితే)
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు 2026 జూలై 30 వరకు మాత్రమే స్వీకరించబడతాయి. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
దరఖాస్తు చివరి తేదీ: 30 జూలై 2026
అధికారిక వెబ్‌సైట్: https://tgobmms.cgg.gov.in/
Indiramma Mahila Shakti Pathakam Telangana Christian Minorities Finance Corporation (TGCMFC) (Sewing Machine Application Form) : Click Here