పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | ICFRE IFB Recruitment 2026 :
పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు…వెంటనే అప్లై చేసుకోండి. | ICFRE IFB Recruitment 2026 :
ICFRE IFB ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2026 :
కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ICFRE – Institute of Forest Biodiversity (IFB) పలు ప్రాజెక్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో రాత పరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరగనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.
ICFRE – Institute of Forest Biodiversity (IFB), హైదరాబాద్ ఆధ్వర్యంలో Junior Research Fellow (JRF), Project Assistant (PA), Field Assistant (FA) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : ICFRE – Institute of Forest Biodiversity (IFB) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) – 01 పోస్టు
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (PA) – 02 పోస్టులు
ఫీల్డ్ అసిస్టెంట్ (FA) – 05 పోస్టులు
మొత్తం ఖాళీలు: 08
విద్యార్హతలు :
Junior Research Fellow (JRF) :
మెరైన్ బయాలజీ, మెరైన్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, ప్లాంట్ సైన్సెస్, అగ్రికల్చర్ లేదా సంబంధిత విభాగంలో M.Sc ఉత్తీర్ణత.
CSIR-UGC NET, UGC-NET, GATE, ICAR-NET లేదా సమానమైన జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత.
Project Assistant (PA) :
B.Sc (వృక్షశాస్త్రం / జంతుశాస్త్రం / పర్యావరణ శాస్త్రం / వ్యవసాయం / అటవీ శాస్త్రం).
Field Assistant (FA) :
Botany లేదా Forestry ఒక సబ్జెక్టుగా ఫస్ట్ క్లాస్ B.Sc ఉత్తీర్ణత.
వయోపరిమితి :
01-06-2026 నాటికి
JRF & Project Assistant: గరిష్టంగా 28 సంవత్సరాలు
Field Assistant: గరిష్టంగా 50 సంవత్సరాలు
వయో సడలింపు :
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మరియు దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
నెల జీతం :
పోస్టును బట్టి రూ.22,000 నుంచి రూ.37,000 వరకు నెల జీతం అందిస్తారు. అదనంగా 27% HRA కూడా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష లేదు
2. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నేరుగా ఎంపిక
దరఖాస్తు విధానం :
ఈ నియామకాలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవసరం లేదు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయో నిర్ధారణ మరియు ఇతర అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీల్లో నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక :
ICFRE – Institute of Forest Biodiversity (IFB)
Dulapally, Kompally (S.O.), Hyderabad – 500100.
ముఖ్యమైన తేదీలు :
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ప్రారంభం: 28 జులై 2026
వాక్-ఇన్ ఇంటర్వ్యూ ముగింపు: 30 జులై 2026
Notification & Application Pdf Click Here
Official Website Click Here